ETV Bharat / city

అద్దె ఇంట్లో రెండుసార్లు చోరీ.. విచారణలో తేలిన మరో నిజం! - అద్దె ఇంట్లోనే దొంగతనం గుంటూరులో

ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడంటారు.. అలా అనుకున్నాడేమో.. ఓ వ్యక్తి తాను అద్దెకున్న యాజమాని ఇంట్లోనే రెండు సార్లు చోరీకి పాల్పడ్డాడు. రూ. 21.50 లక్షలు అపహరించాడు. ఈ కథలో ఇంకో ట్విస్ట్..ఏంటంటే.. ఇంత సొమ్ము పోతే పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో మాత్రం ఇంటి యజమాని 2 లక్షలే పోయిందని ఫిర్యాదు చేశాడు. విచారణ చేపట్టిన పోలీసులకు తీగలాగితే డొంకంతా కదిలినట్లు నమ్మలేని నిజాలు వెలుగుచూశాయి.

ap crime news
అద్దె ఇంట్లో 2 సార్లు చోరీ.. విచారణలో తేలిన మరో నిజం!
author img

By

Published : Aug 11, 2020, 7:53 PM IST

అద్దెకు వచ్చి అదే ఇంటిలో రెండు సార్లు దొంగతనానికి పాల్పడిన నిందితుడిని గుంటూరు గ్రామీణ పోలీసులు అరెస్ట్ చేశారు. రూ.21.50 లక్షల నగదు స్వాధీనం చేసుకుని కోర్టులో హాజరపర్చినట్లు గుంటూరు గ్రామీణ ఎస్పీ విశాల్ గున్ని తెలిపారు. అదే ఇంటిలో నిందితుడు రెండు నెలల క్రితం రూ. 5.15 లక్షల నగదును దొంగతనం చేశాడని వెల్లడించారు. అదే ఇంట్లో సోమవారం చోరీకి పాల్పడినట్లు ఎస్పీ తెలిపారు.

నమ్మించి.. వంచించి...

ఏపీలోని గుంటూరు జిల్లా తెనాలి ఇస్లాంపేటలో కౌతారపు నమ్మయ్య అనే కిరాణా వ్యాపారి ఇంట్లో.. నాయుడు తిరుపతయ్య అనే వ్యక్తి గత కొద్దిరోజులుగా అద్దెకు ఉంటున్నాడు. ఇంటి యజమాని దగ్గర నమ్మకంగా ఉన్నాడు. ఇదే అదనుగా భావించి రెండు నెలల క్రితం రూ. 5.15 లక్షలు చోరీ చేసి పరారయ్యాడు. అప్పుడే నిందితుడ్ని అరెస్టు చేశారు. బెయిల్ మీద బయటొకొచ్చిన వ్యక్తి మళ్లీ అదే ఇంట్లో తన చేతి వాటం చూపించాడు.

ఈనెల 10న అదే ఇంటిలో మళ్లీ దొంగతనం చేసి పరారయ్యాడు. దీనిపై తెనాలి పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టి రేపల్లెలో నిందితుడిని అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి రూ. 21.50 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.

ap crime news
అద్దె ఇంట్లో 2 సార్లు చోరీ.. విచారణలో తేలిన మరో నిజం!

తీగ లాగారు.. డొంక కదిలింది

అయితే ఇదంతా బాగానే ఉంది.. కానీ ఇంటి యజమాని మాత్రం రూ. 2 లక్షలే చోరీకి గురయ్యాయని ఫిర్యాదు చేశాడు. అనుమానం వ్యక్తం చేసిన పోలీసులు.. దర్యాప్తు ముమ్మరం చేశారు. తక్కువ మొత్తంలో నగదు చోరీ అయిందని ఎందుకు ఫిర్యాదు చేశాడనే కోణంలో దర్యాప్తు చేశారు. సదరు యజమాని గుట్కా వ్యాపారం చేస్తాడని.. అందువల్లే కేవలం రూ.2 లక్షలే పోయినట్లు ఫిర్యాదు చేసినట్లు గుర్తించారు.

ఇవీచూడండి: కరోనా అనుమానం: ఫ్యానుకు ఉరివేసుకుని మహిళ ఆత్మహత్య

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.