ETV Bharat / city

JAGAN CBI CASES: జగన్​ అక్రమాస్తుల కేసు.. హాజరైన ఎంపీ విజయసాయి రెడ్డి - jagan cbi case

జగన్​ అక్రమాస్తుల కేసులో(jagan CBI cases news) హైదరాబాద్​ నాంపల్లిలోని సీబీఐ కోర్టులో(Nampally CBI Court) విచారణ కొనసాగుతోంది. ఇవాళ విచారణకు ఎంపీ విజయసాయిరెడ్డి హాజరు కాగా.. ఏపీ సీఎం జగన్​కు కోర్టు మినహాయింపునిచ్చింది. వాన్‌పిక్, లేపాక్షి ఈడీ కేసుల్లో ఏపీ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు హాజరు కాగా.. ఈడీ లేపాక్షి, గృహనిర్మాణ కేసుల విచారణ వచ్చే నెల 28కి వాయిదా పడింది.

jagan cbi cases
హైదరాబాద్​ నాంపల్లిలోని సీబీఐ కోర్టులో c జగన్​ అక్రమాస్తుల కేసు విచారణ
author img

By

Published : Sep 22, 2021, 5:04 PM IST

హైదరాబాద్​ నాంపల్లిలోని సీబీఐ, ఈడీ కోర్టులో జగన్ అక్రమాస్తుల(jagan CBI cases news) కేసుల విచారణ కొనసాగుతోంది. ఈడీ వాన్​పిక్, గృహ నిర్మాణ కేసుల విచారణ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ రోజు హాజరుకు ఏపీ సీఎం జగన్​కు కోర్టు మినహాయింపునిచ్చింది. సీబీఐ కోర్టుకు(CBI COURT) ఎంపీ విజయసాయిరెడ్డి హాజరయ్యారు.

వాన్​పిక్, లేపాక్షి ఈడీ కేసుల్లో ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు హాజరుకాగా... లేపాక్షినాలెడ్జ్ హబ్ కేసులో జె. గీతారెడ్డి హాజరయ్యారు. నిమ్మగడ్డ ప్రసాద్, శ్యాంప్రసాద్ రెడ్డి, నిమ్మగడ్డ ప్రకాశ్​తో పాటు ఐఏఎస్ మురళీధర్ రెడ్డి, విశ్రాంత అధికారులు బి.పి. ఆచార్య, శామ్యూల్, మన్మోహన్ సింగ్, బ్రహ్మానందరెడ్డి హాజరయ్యారు. ఈడీ లేపాక్షి, గృహనిర్మాణ కేసుల విచారణ వచ్చే నెల 28కి వాయిదా పడింది.

ఇదీ చదవండి:

రూటు మార్చిన మోదీ ఫ్లైట్- అఫ్గాన్​ వద్దు.. పాక్​ ముద్దు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.