ETV Bharat / city

కాజీపేట- బళ్లార్ష మధ్య మూడో లైన్​ మరో 22 కిమీ పూర్తి - telangana latest news

కాజీపేట- బళ్లార్ష మధ్య మూడో లైన్​ మరో 22 కిమీ పూర్తయినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. రాకపోకలు ప్రారంభమైనట్లు తెలిపింది. ఈ లైను కాజీపేట-బళ్లార్ష మధ్య గ్రాండ్‌ ట్రాంక్‌ మార్గంలో ట్రిప్లింగ్‌ ప్రాజెక్టు రైళ్ల రాకపోకలకు మరింత సౌలభ్యాన్ని కల్పించగలదని దక్షిణ మధ్య రైల్వే జనరల్​ మేనేజర్​ గజానన్​ మాల్య అభిప్రాయపడ్డారు.

railway
కాజీపేట- బళ్లార్ష మధ్య మూడో లైన్​ మరో 22 కిమీ పూర్తి
author img

By

Published : Oct 19, 2020, 5:49 AM IST

తెలంగాణ నుంచి ఉత్తరాది రాష్ట్రాల వైపు రైళ్ల రాకపోకలు సులభతరం, వేగవంతం చేసేందుకు చేపట్టిన మూడో లైను ప్రాజెక్టులో కీలక భాగం అందుబాటులోకి వచ్చింది. ఈ మేరకు కాజీపేట- బళ్లార్ష మధ్య 22 కి.మీ ట్రిప్లింగ్​, విద్యుదీకరణ పనులు పూర్తి చేసినట్లు రైల్వే శాఖ ప్రకటన విడుదల చేసింది.

ఈ సెక్షనులోని అనేక సిమెంట్‌ క్లస్టర్లు, బొగ్గు స్క్రీనింగ్‌ ప్లాంట్‌లు, విద్యుత్‌ ప్లాంట్లను అనుసంధానించడంలో ఈ లైను ప్రధాన పాత్రను పోషిస్తుందని ఆశాభావం వ్యక్తం చేసింది.

2015-16 ఏడాదిలో రూ.2,063 కోట్ల అంచనా వ్యయంతో కాజీపేట-బళ్లార్ష సెక్షన్​లో మిగిలిన 202 కిలోమీటర్లలో తెలంగాణలో 159 కి.మీ, మహారాష్ట్ర 43 కి.మీల పొడవున ట్రిప్లింగ్‌, విద్యుదీకరణ పనులకు అనుమతులను మంజూరు చేశారు. మూడో లైన్​కు సంబంధించి తెలంగాణ-మహారాష్ట్రాల వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో గత ప్రాజెక్టులోని అన్ని పనులను అదే సమయంలో ప్రారంభమై.. వేగవంతగా కొనసాగుతున్నాయి. ఈ ప్రాజెక్టు ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకొని నిర్మాణ పనులకు పెద్దపీట వేశారు.

కొలనూరు, రాఘవాపురం మధ్య 22 కి.మీల పొడవున మూడో లైను, విద్యుదీకరణ పనులు పూర్తైయ్యాయి. రైళ్ల రాకపోకలు కూడా ప్రారంభమయ్యాయి. అధికారులు, సిబ్బంది కృషిని దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ గజానన్‌ మాల్య ప్రశంసించారు. ఈ లైను కాజీపేట-బళ్లార్ష మధ్య గ్రాండ్‌ ట్రాంక్‌ మార్గంలో ట్రిప్లింగ్‌ ప్రాజెక్టు రైళ్ల రాకపోకలకు మరింత సౌలభ్యాన్ని కల్పించగలదని ఆయన అభిప్రాయపడ్డారు. పెద్దపల్లి జిల్లాలో సామాజిక, ఆర్థికాభివృద్ధితో పాటు పొరుగు జిల్లాల అభివృద్ధికి తోడ్పడుతుందన్నారు.

ఇవీచూడండి: శరవేగంగా కాజీపేట రైల్వే బ్రిడ్జి పనులు.. వచ్చే ఏడాది కల్లా ప్రారంభం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.