ETV Bharat / city

"మనం చూపే బేలతనమే శత్రువుకు బలం" - Justice For Disha latest news]

ఆపద ముంచుకొస్తున్నా.. కాలి కింద నేల కుంగి పోతున్నా నిబ్బరం కోల్పోకుండా ఉండటం చాలా అవసరం. ముఖ్యంగా ఆపద సమయంలో మనం చూపే బేలతనమే శత్రువుకు బలం తీసుకొస్తుందని సైకాలజిస్టులు చెబుతున్నారు. తాజాగా నగర శివారులో జరిగిన యువతి అత్యాచారం, హత్య కేసు పరిశీలిస్తే.. పక్కాగా ప్రణాళిక ప్రకారం ఉచ్చు బిగించినట్లు స్పష్టమవుతోంది.

"మనం చూపే బేలతనమే శత్రువుకు బలం"
"మనం చూపే బేలతనమే శత్రువుకు బలం"
author img

By

Published : Dec 2, 2019, 11:52 PM IST

రాబోవు ప్రమాదాన్ని "దిశ" పసిగట్టినా.. అంతే వేగంగా తప్పించుకోవడంలో చొరవ చూపకపోవడంతో నిందితులు దాన్ని అలుసుగా తీసుకున్నారు. వాహనానికి పంచర్‌ వేస్తామని చెప్పగా.. ఆమె వారిని అమాయకంగా నమ్మడంతో అదే అదనుగా అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఒంటరిగా.. ఆపద సమయంలో చిక్కుకున్న మహిళలు, యువత అప్రమత్తంగా ఉండాలని సైకాలజిస్టు కల్యాణ చక్రవర్తి చెబుతున్నారు. ఈ సందర్భంగా కొన్ని సూచనలు చేశారు.

  • ఎవరూ లేని ప్రాంతంలో ఓవ్యక్తి తన పనులు మానేసి మనకు సహాయం చేసేందుకు వస్తున్నాడంటే.. తొలుత అనుమానించాలి. తేడాగా అనిపిస్తే వెంటనే అక్కడినుంచి వెళ్లిపోవాలి.
  • వ్యక్తిగత వివరాలు ఆరా తీస్తే వెంటనే అప్రమత్తం కావాలి. సహాయం చేసేవారు 100లో 99 మంది ఉండొచ్చు. మిగిలిన ఆ ఒక్కడే మనకు ముప్పు చేసేవాడో.. ప్రాణాలు తీయడమో చేస్తాడని గుర్తించాలి.
  • మనతో మాట్లాడుతున్న వ్యక్తి మద్యం తీసుకొని ఉన్నాడా? పాన్‌ మసాలా లాంటివి నములుతూ.. తూలుతూ ఉన్నాడా? గ్రహించాలి. అలాంటి వారినుంచి దూరంగా వెళ్లిపోవాలి.
  • ఎప్పుడూ బ్యాగులో పెప్పర్‌ స్ప్రే, నీళ్ల సీసా పెన్సిల్‌, పెన్ను లాంటివి అందుబాటులో పెట్టుకోవాలి. ఏదైనా ఆపద వచ్చినప్పుడు అప్పటికప్పుడు వాటితో దాడి చేసేందుకు ఉపయోగించాలి. మీ ప్రాణాలు కాపాడుకోవడానికి చేసిన దాడిలో నిందితుడు మృతి చెందినా అది ఆత్మరక్షణ కిందకే వస్తుంది.
  • చీకట్లో బండి ఆగిపోయినా.. లేదా ఒంటరిగా ఉండాల్సి వచ్చినప్పుడు వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అందించాలి. స్మార్ట్‌ఫోన్లు వచ్చిన తర్వాత లొకేషన్‌ తెలుసుకోవడం చాలా సులువు. మనమున్న లొకేషన్‌ ఆప్తులకు వెంటనే షేర్‌ చేయాలి. ఇంకా ప్రమాదంలో ఉంటే పోలీసు కంట్రోల్‌ రూం 100కు ఫోన్‌ చేయాలి.
  • ఆపద సమయంలో మనోధైర్యం ప్రదర్శించాలి. శత్రువును మాటలతో దెబ్బ తీయాలి. మన జోలికి వస్తే.. తర్వాత జరిగే పరిమాణాలపై హెచ్చరించాలి.
  • కార్యాలయం, కాలేజీకు వెళ్లేప్పుడు.. తిరిగే వచ్చేప్పుడు అడ్డదారులు కాకుండా అందరూ వెళ్లే మార్గం ఉపయోగించాలి.
  • సొంత ద్విచక్ర వాహనంపై వెళుతున్నప్పుడు ఏదైనా కారణంతో ఆగిపోతే ఒక చోట నిలిపివేసి వెళ్లిపోవాలి.

ఇదీ చూడండి: "దిశ" నిందితుల కస్టడీ కోరుతూ పిటిషన్

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.