మన్‌కీ బాత్ కార్యక్రమంలో హైదరాబాద్ బోయిన్‌పల్లి కూరగాయల మార్కెట్‌పై ప్రధాని మోదీ ప్రత్యేక ప్రశంసలు కురిపించారు. పాడైపోయిన కూరగాయల నుంచి విద్యుత్ ఉత్పత్తి చేస్తుండటంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ప్రతిరోజూ 10 టన్నుల చెత్త నుంచి 500 యూనిట్ల విద్యుత్, 30 కేజీల బయో ఫ్యూయల్ ఉత్పత్తి చేస్తున్నారని ప్రధాని వెల్లడించారు.
ఆ కరెంట్ నుంచే బోయిన్‌పల్లి కూరగాయల మార్కెట్లో విద్యుత్ కాంతులు ప్రసరించడంతోపాటు.. బయో ఫ్యూయల్ ద్వారా మార్కెట్లోని క్యాంటీన్‌లో ఆహారాన్ని వండుతున్నారని తెలిపారు. ఈ ప్రక్రియ మనందరికీ ఎంతో ఆదర్శనీయమని ప్రధాని మోదీ ప్రశంసించారు.
ఇదీ చూడండి: 'అవి ఎక్కువగా ఉన్నవాళ్లలోనే కొవిడ్ సమస్య తీవ్రం '