కొత్త డీలర్లను, రేషన్ షాపులను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్లు మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. శాసనసభలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క వ్యక్తి కూడా ఆకలితో చనిపోకూడదన్న లక్ష్యంతో సీఎం కేసీఆర్ ఆహార భద్రత కల్పిస్తునట్లు వెల్లడించారు. దీని కోసమే బడ్జెట్లో వేల కోట్ల రూపాయలు కేటాయించినట్లు మంత్రి తెలిపారు. వృద్ధులకు డబ్బులు ఇవ్వటం వల్ల లాభం లేదని.. చరమాకంలో బియ్యం ఇస్తే కడుపునిండా తింటారన్నారు. రాష్ట్రంలో పండిన ప్రతిగింజను సద్వినియోగం చేసుకుంటామని స్పష్టం చేశారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లతో పండిన పంటలకు మంచి లాభాలు వస్తాయని.. వీటిని ఏర్పాటు చేసేందుకు రైతులు ముందుకు వస్తున్నట్లు పేర్కొన్నారు. కొన్ని దేశాల్లో ఆహారం లేక చనిపోయిన సందర్భాలున్నాయని.. అలాంటి దుస్థితి రాష్ట్రంలో తలెత్తకుండా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.
పేదవాడికి పట్టెడన్నం పెట్టడమే ప్రభుత్వ లక్ష్యం - FOOD
తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క వ్యక్తి ఆకలితో చనిపోకూడదన్న లక్ష్యంతో సీఎం కేసీఆర్ ఆహార భద్రత కల్పిస్తునట్లు మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. కొత్త డీలర్లు, రేషన్ షాపుల ఏర్పాటుపై శాసనసభలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు.