AP New Cabinet Issue : ఏపీలో మంత్రి పదవి రాని సామాజికవర్గాలకు కొన్ని పోస్టులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు స్టేట్ డెవలప్‌మెంట్ బోర్డు ఛైర్మన్‌గా కమ్మ సామాజిక వర్గానికి చెందిన కొడాలి వెంకటేశ్వరరావు(నాని)ను నియమించాలని నిర్ణయం తీసుకుంది. ఆర్యవైశ్య సామాజికవర్గానికి కూడా కొత్త కేబినెట్ లో చోటు దక్కక పోవటంతో కోలగట్ల వీరభద్రస్వామికి డిప్యూటీ స్పీకర్ పదవి, కేబినెట్ బెర్త్ దక్కని క్షత్రియ సామాజిక వర్గానికి చీఫ్‌విప్ పదవి ఇవ్వాలని నిర్ణయించింది. నర్సాపురం ఎమ్మెల్యే ప్రసాదరాజు చీఫ్ విప్ పదవి చేపట్టనున్నారు. అలాగే బ్రాహ్మణ సామాజికవర్గం నుంచి విజయవాడ ఎమ్మెల్యే మల్లాది విష్ణుకు ఏపీ ప్లానింగ్ బోర్డు వైస్ ఛైర్మన్ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసింది.
మంత్రి పదవి దక్కని సామాజికవర్గాలకు కొన్ని పోస్టులు!
AP New Cabinet Issue : ఏపీలో నూతన మంత్రి వర్గంలో స్థానం దక్కని సామాజిక వర్గాలను బుజ్జగించే ప్రయత్నాలను ప్రభుత్వం చేపట్టింది. ఈ మేరకు ఆయా సామాజికవర్గంలోని వారికి కొన్ని పోస్టులను ఇచ్చేందుకు నిర్ణయం తీసుకుంది.