ETV Bharat / city

శరీరమే ఆమె కాన్వాస్.. స్త్రీవాదమే ఆమె చిత్రాలకు ప్రేరణ - ఆర్టిస్ట్ అభీజ్ఞ

Artist Abhigna : ప్రస్తుత కాలంలో కళలకు ఉన్న ఆదరణే వేరు. అందులోనూ చిత్ర కళలకు ప్రత్యేక స్థానం ఉంది. సాధారణంగా చిత్రాలను కాన్వాస్‌పై లేదా.. డ్రాయింగ్‌ షీట్‌పై వేస్తారు. కానీ, ఆ యువతి మాత్రం శరీరాన్నే కాన్వాస్‌గా మార్చుకుని అద్భుతమైన చిత్రాలను వేస్తోంది. దేవతలు, పురాణాల్లోని స్త్రీ పాత్రలను స్ఫూర్తిగా తీసుకుని... సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. తనే హైదరాబాద్‌కు చెందిన అభీజ్ఞ. హైదరాబాద్‌లో తొలిసారిగా ఆమె గీసిన చిత్రాలు ప్రదర్శనకు ఉంచారు. మరి మనము కూడా ఆ చిత్రాలను చూసేద్దామా.

Artist Abhigna
Artist Abhigna
author img

By

Published : Jul 1, 2022, 11:06 AM IST

శరీరమే ఆమె కాన్వాస్

Artist Abhigna : కాన్వాస్‌పై పెయింటింగ్ వేయాలంటే సృజనాత్మకత ఉంటే సరిపోతుంది. కానీ...శరీరాన్నే కాన్వాస్‌లా మార్చి పేయింటింగ్ వేస్తే మాత్రం సృజనాత్మకతతో పాటు ఓపిక కూడా ఉండాలి. అవును.. ఎలా అంటే కాన్వాస్‌పై అయితే కదలకుండా ఎంతో సేపు ఐనా పెయింటిగ్స్‌ వేస్తారు. కానీ.. మనిషి కదలకుండా ఉండడు... అలాంటి సమయంలో పెయింటింగ్ వేయడం అంటే చాలా కష్టం. మరి అలాంటి శరీరంపైన వేసిన చక్కటి కళాఖండాలను పరిచయం చేస్తుంది అభీజ్ఞ.

Abhigna The painter : ఏడేళ్ల ప్రాయంలోనే అభిజ్ఞ ప్రతిభ గుర్తించిన తల్లి నీలిమా.. చిత్రాలు గీసేలా ప్రోత్సహించింది. అలా అది తన అలవాటుగా మారిపోయింది. చికాగోలోని ఆర్ట్ ఇనిస్టిట్యూట్‌లో బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్‌, లండన్‌లోని రాయల్ కాలేజ్‌లో మాస్టర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్‌ను పూర్తిచేసింది. ఆమె ప్రతిభకు మెచ్చి చికాగో యూనివర్సిటీ మెరిట్ స్కాలర్‌షిప్‌ కూడా అభీజ్ఞకు అందించింది.

The Feminize Art Exhibition : అభీజ్ఞ సమాజంలోని స్త్రీ అంశాలను, పురాణ కథల్లోని స్త్రీ పాత్రలను, చరిత్ర నుంచి వీర వనితలను తన చిత్రకళాలలో భాగం చేస్తోంది. స్త్రీవాదంపైనే చిత్రాలను గీయడం అలవాటుగా మార్చుకున్న అభీజ్ఞ తనపై తాను కూడా అనేక చిత్రాలను గీసుకుంది. అలా శరీరంనే... నేను కాన్వాస్‌లా మార్చుకుని చిత్రాలను గీస్తున్నాని అంటోంది.

ఇప్పటి వరకు 50కి పైగా చిత్రాలు వేసిన అభీజ్ఞ.. మెుఘల్, రాజ్‌పుత్, చెరియల్ పెయింటింగ్ నుంచి స్ఫూర్తి పొందినట్లు చెబుతోంది. అలా సమాజంలోని ఎంతో గుర్తింపు పొందిన వ్యక్తుల చిత్రాలను వేసింది. శరీరంపై పెయింటింగ్స్‌ వేయడం కష్టమైన పనే కానీ... నేను పెయింటిగ్స్‌ వేసే సమయంలో మీనాక్షి, ఆండాలు వంటి వాళ్లతో తనను పోల్చుకుంటానని అంటోంది.

ప్రస్తుతం ఏర్పాటు చేసిన పెయిటింగ్‌ ప్రదర్శనలో ఎక్కువగా మహిళల చిత్రాలే ఉన్నాయి. వీటిలో ముఖాలు, చేతులు, వీపు భాగంపై వేసుకున్న దేవతలు, చరిత్రలోని స్త్రీల చిత్రాలు చాలా ఆకట్టుకుంటున్నాయి. పురాణాలలోని అద్భుత కథల నుంచి ప్రేరణ పొందిన చిత్రాలు, ప్రస్తుత సమాజంలోని మహిళలతో కొత్త పాత్రలను సృష్టించి చిత్రాలను వేయడం అభీజ్ఞ ప్రత్యేకత. ఈ చిత్రకళా ప్రదర్శనకు మహిళల నుంచి అనూహ్య స్పందన వస్తోంది.

'గతంలో అలయన్స్ ఫ్రాంచైజ్‌తో కలిసి బృందంగా హైదరాబాద్‌లో ఓసారి ప్రదర్శన చేశాను. ప్రస్తుతం జరుగుతున్న ప్రదర్శనను మాత్రం నా భర్త అవినాష్ సహకారంతో నిర్వహిస్తున్నాను. ఈ అద్భుత చిత్రకళా ప్రదర్శనను ది ఫెమినైజ్ పేరుతో ఖాజాగూడలోని మాలక్ష్మి కోర్ట్ యార్డ్ భవనంలో ఏర్పాటు చేశాను. నా చిత్రాలు బాగున్నాయని అందరూ అంటుంటే చాలా సంతోషంగా ఉంది. అదే నా విజయంగా భావిసున్నాను. ప్రపంచ వ్యాప‌్తంగా సాధ్యమైనంత వరకు స్త్రీవాదాన్ని ప్రచారం చేసేందుకు నేను పెయింటింగ్స్ వేస్తుంటాను.' -- అభీజ్ఞ, ఆర్టిస్ట్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.