ETV Bharat / city

VISHAKA STEEL PLANT:'ఈ పిటిషన్ విచారణార్హం కాదు.. కొట్టేయండి' - హైకోర్టులో కేంద్ర అఫిడవిట్ దాఖలు

ఏపీలోని విశాఖ ఉక్కు పరిశ్రమలో పెట్టుబడుల ఉపసంహరణపై కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్‌ కమిటి కూలంకషంగా చర్చించిందని హైకోర్టుకు కేంద్ర ప్రభుత్వం నివేదించింది. ఆర్థికపరమైన ప్రభుత్వ విధానాలు న్యాయసమీక్ష పరిధిలోకి రావని సుప్రీంకోర్టు పలు తీర్పుల్లో పేర్కొందని తెలిపింది. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను సవాల్‌ చేస్తూ సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ దాఖలు చేసిన పిల్‌కు విచారణార్హత లేదని.. దానిని కొట్టేయాలని కోరింది.

the-central-government-has-filed-an-affidavit-in-the-high-court-on-the-privatization-of-the-visakhapatnam-steel-industry

author img

By

Published : Jul 29, 2021, 9:14 AM IST

VISHAKA STEEL PLANT:'ఈ పిటిషన్ విచారణార్హం కాదు.. కొట్టేయండి'

ఏపీలోని విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను సవాల్‌ చేస్తూ హైకోర్టులో దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. పెట్టుబడులు, ప్రజా ఆస్తుల నిర్వహణ శాఖ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ ఈ మేరకు హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. విశాఖ ఉక్కు పరిశ్రమలో వంద శాతం పెట్టుబడుల ఉపసంహరణపై కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటి కూలంకషంగా చర్చించిందని కేంద్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది.

పరిశ్రమలో కేంద్ర ప్రభుత్వ వాటాగా ఉన్న వంద శాతం పెట్టుబడులను ఉపసంహరించాలని సీసీఈఏ.. 2017 జనవరి 27న సూత్రప్రాయంగా అంగీకరించిందని పేర్కొంది. సీసీఈఏలో ప్రధాన మంత్రి, కేంద్ర హోంమంత్రి, కేంద్ర పెట్రోల్, సహజవాయువు, ఉక్కుశాఖ మంత్రి, కేంద్ర ఆర్థిక మంత్రి, కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రి ఉన్నారని తెలిపింది. ఆర్థికపరమైన ప్రభుత్వ విధానాలు న్యాయసమీక్ష పరిధిలోకి రావని సుప్రీంకోర్టు పలు తీర్పుల్లో పేర్కొందని గుర్తు చేసింది.

మరొక నిర్ణయం మరింత శాస్త్రీయంగా ఉందనే కారణంతో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని న్యాయస్థానం కొట్టేయజాలవని స్పష్టంచేసింది. విధానపరమైన నిర్ణయం దురుద్దేశంతో, వివక్షతో ఉన్నప్పుడు మాత్రమే న్యాయస్థానం జోక్యం చేసుకోవచ్చని పేర్కొంది. విశ్రాంత సీబీఐ జేడీ వీవీ లక్ష్మీనారాయణ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యాలకు విచారణార్హత లేదని.. వాటిని కొట్టేయాలని హైకోర్టును కోరింది.

ఆత్మ నిర్భర్ భారత్‌లో భాగంగా కేంద్ర మంత్రి వర్గం ఈ ఏడాది జనవరి 27న నూతన పబ్లిక్ సెక్టార్ ఎంటర్‌ప్రైజ్‌ విధానాన్ని ఆమోదించిందని అఫిడవిట్‌లో కేంద్రం తెలిపింది. ఆ విధానానికి అనుగుణంగా వ్యూహాత్మక సెక్టార్స్ విషయంలో సిఫారసులు చేసే బాధ్యతను నీతి ఆయోగ్ కు అప్పగించిందని పేర్కొంది. నూతన పీఎస్ఈ విధానంలో ఇనుము, ఉక్కు సెక్టార్‌ను స్ట్రాటజిక్ సెక్టార్‌గా వర్గీకరించలేదని కేంద్రం తెలిపింది. ఈ నేపథ్యంలో విశాఖ ఉక్కు పరిశ్రమను స్ట్రాటజిక్ సెక్టార్ కిందకు రాదని స్పష్టం చేసింది.

ఈ నూతన విధానంలో నాన్-స్ట్రాటజిక్ సెక్టార్ కింద ఉన్న పీఎస్ఈలను ఆచరణ సాధ్యమైన చోట ప్రైవేటీకరించడం.. అలా కాని పక్షంలో మూసివేతకు నిర్ణయించారని అఫిడవిట్‌లో వివరించింది. సీసీఈఏ తీసుకున్న నిర్ణయం దురుద్దేశంతో, వివక్షతో కూడుకొందని చెప్పేందుకు పిటిషనర్ ఎలాంటి వివరాల్ని కోర్టు ముందు ఉంచలేదని రాజేష్‌కుమార్‌ సింగ్‌ అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ప్రత్యామ్నాయ చర్యలు తీసుకునేలా కేంద్రాన్ని ఆదేశించాలని పిటిషనర్ కోరడం న్యాయవిచారణ ప్రక్రియను దుర్వినియోగం చేయడమే అవుతుందన్నారు.

ఉద్యోగులు, వారి భవిష్యత్తు గురించి పిటిషనర్ ఆందోళన కేవలం ఊహాజనితమేనన్నారు. పీఎస్ఈ విధానంలో నూతన భాగస్వాములతో జరిగే ఒప్పందంలో ఉద్యోగలను నిర్దిష్ట కాలం తొలగించడానికి వీల్లేకుండా, ప్రయోజనాలను తగ్గించకుండా ఒప్పందం జరుగుతుందన్నారు. నూతన యాజమాన్యం కింద ఉక్కు పరిశ్రమ విశాఖపట్నంలోనే యథావిథిగా కొనసాగుతుందని తెలిపారు. 2019 సాధారణ ఎన్నికల్లో పిటిషనర్ విశాఖ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేశారని అఫిడవిట్‌లో పేర్కొన్నారు. రాజకీయ అవకాశాల కోసం ఆర్థిక, సామాజిక అంశాలను తెరపైకి తెచ్చి ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేసినట్లు కనబడుతోందన్నారు. ఈ అంశాల్ని పరిగణనలోకి తీసుకొని పిల్‌ను కొట్టేయాలని కోరారు.

ఇదీ చదవండి:

Bike Theft: 9 ఏళ్ల క్రితం పోయిన బైకుకు చలానాలు.. పట్టుకొమ్మంటే మాత్రం..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.