హామీల అమలులో సీఎం విఫలం: సీఎల్పీ నేత భట్టి - HYDERABAD
సీఎం కేసీఆర్ ఎన్నికల హామీలపై శాసన సభలో సీఎల్పీ నేత భట్టివిక్రమార్క ప్రభుత్వాన్ని నిలదీశారు. హరితహారం కోసం కోట్లు ఖర్చు చేసినప్పటికీ... గ్రామాల్లో పచ్చదనం కనిపించటం లేదన్నారు. ప్రఖ్యాత సంస్థలన్నీ కాంగ్రెస్ హయాంలోనే హైదరాబాద్‌కి వచ్చాయని గుర్తుచేశారు.
"కేసీఆర్ ఎన్నికల హామీలు విస్మరించారు"
తెరాస ప్రభుత్వం అధికారంలోకి వచ్చేటప్పుడు ఎన్నో హామీలు ఇచ్చిందని.. తీర వచ్చాక వాటిని విస్మరించిందని సీఎల్పీ నేత భట్టివిక్రమార్క అన్నారు. శాసన సభలో ఎన్నికల ముందు సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలపై ప్రభుత్వాన్ని నిలదీశారు. హరితహారం కోసం కోట్లు ఖర్చు చేసినప్పటికీ... గ్రామాల్లో పచ్చదనం కనిపించటం లేదని ఎద్దేవా చేశారు. గిరిజనులు సాగుచేస్తున్న భూములకు హక్కు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. దళిత, గిరిజనులకు మూడెకరాల భూమి ఇస్తామన్న హామీ అమలు కావటంలేదని భట్టి విక్రమార్క తెలిపారు. కాంగ్రెస్ హయాంలోనే ప్రఖ్యాత సంస్థలు హైదరాబాద్‌కి వచ్చాయని వెల్లడించారు.