ETV Bharat / city

ఫలితాలు వెలువడినా.. ఆ గ్రామాల్లో ఉద్రిక్త పరిస్థితులు - పంచాయతీ ఎన్నికల ఫలితాలు

ఆంధ్రప్రదేశ్​లో రెండో విడత పంచాయతీ ఎన్నికల ఫలితాలు వెలువడినా.... గ్రామాల్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగాయి. ఇరు వర్గాల మధ్య గొడవలు, ఘర్షణలు తలెత్తాయి. వైకాపా అధికారాన్ని అడ్డుపెట్టుకుని అక్రమాలకు పాల్పడుతోందని తెలుగుదేశం ఆరోపిస్తోంది.

tension-in-second-face-panchayath-election-results
ఫలితాలు వెలువడినా.. ఆ గ్రామాల్లో ఉద్రిక్త పరిస్థితులు
author img

By

Published : Feb 15, 2021, 5:39 AM IST

ఆంధ్రప్రదేశ్​లోని గుంటూరు జిల్లా పల్నాడులో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మారెళ్లవారి పాలెం, ఇనిమెల్ల గ్రామాల్లో తలెత్తిన వివాదాలు పోలీసుల రంగ ప్రవేశంతో సద్దుమణిగాయి. జండ్ల మండలం ములకలూరులో ఫలితాలు వెలువడిన తర్వాత ప్రజలు ఇళ్లకు వెళ్తుండగా వివాదం తలెత్తింది. అది ఇరువర్గాల మధ్య రాళ్లదాడికి దారి తీసింది. ఈ ఘటనలో తెలుగుదేశం కార్యకర్తలు గాయపడ్డారు. పల్నాడులో ఓ ప్రాంతానికి రెండో దశ ఎన్నికలు ముగియగా... మరో ప్రాంతానికి మూడో దశలో ఎన్నికలు జరగనున్నాయి. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో 15వేల మందిని పోలీసులు బైండోవర్‌ చేశారు. తెలుగుదేశం మద్దతుదారులను బెదిరించి బలవంతపు ఏకగ్రీవాలకు అధికార పార్టీ పాల్పడుతోందని.. ఆ పార్టీ నేత జీవీ ఆంజనేయులు విమర్శించారు.

జీవీ ఆంజనేయులు, తెదేపా నేత

ఆంధ్రప్రదేశ్​లోని శ్రీకాకుళం జిల్లా వంగర మండలం శ్రీహరిపురంలో ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ ఇరువర్గాల పోరుగా మారింది. రెండో దశ పల్లె పోరులో తెలుగుదేశం బలపరిచిన అభ్యర్థి విజయం సాధించడంతో... ఇద్దరి వ్యక్తుల మధ్య మాటామాటా పెరిగి వివాదానికి దారితీసింది. వీరఘట్టం మండలం కంబరలో ఇరువర్గాల దాడిలో ముగ్గురు తెలుగుదేశం కార్యకర్తలు గాయపడ్డారు. విజయనగరం జిల్లా పార్వతీపురం మండలం అడ్డాపు శిల పంచాయతీ బంట వాని వలసలో యువకులపై దాడి జరిగింది. వైకాపా బలపరిచిన అభ్యర్థి విజయానికి సహకరించారని కోపంతో ప్రత్యర్థి అభ్యర్థి వర్గీయులు దాడి చేశారని బాధితులు వాపోయారు.

ఫలితాలు వెలువడినా.. ఆ గ్రామాల్లో ఉద్రిక్త పరిస్థితులు

కర్నూలు జిల్లా పత్తికొండ మండలం నలకదొడ్డిలో తెలుగుదేశం మద్దతుదారులపై వైకాపా నాయకులు దాడి చేశారు. అటికెలగుండులో ప్రచారానికి వెళ్తుండగా దాడి చేసినట్లు ఫిర్యాదు చేశారు. చిత్తూరు జిల్లా తెరణిలో అధికారులను అడ్డుపెట్టుకుని ఎమ్మెల్యే రోజా వైకాపా మద్దతుదారులను గెలిపించుకున్నారని... తెదేపా నాయకులు ఆరోపించారు.

నెల్లూరు జిల్లాలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో వైకాపా అధికారాన్ని అడ్డుపెట్టుకుని... అక్రమాలకు పాల్పడుతోందని... తెలుగుదేశం విమర్శించింది. ఐదు ఓట్ల తేడాతో తెలుగుదేశం అభ్యర్థులు గెలిస్తే మళ్లీ రీకౌంటింగ్‌ పేరుతో ఓడించారని విమర్శించారు. ప్రకాశం జిల్లా దొనకొండ కోచెర్ల కోటలో రెండో దశ పల్లెపోరులో ఎంపీడీఓ అవకతవకలకు పాల్పడ్డారని గ్రామస్థులు ఆరోపించారు. లెక్కింపు ప్రక్రియ ఆలస్యం చేసి... మొదట ఒక అభ్యర్థి గెలిచినట్లు ప్రకటించి... తర్వాత మరో అభ్యర్థి విజయం సాధించినట్లు ప్రకటించారని ఆరోపించారు.

ఇదీ చదవండి : రేపటి నుంచే ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.