ETV Bharat / city

Top news: టాప్​ న్యూస్ @ 5PM - Telugu top ten news

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

Telugu top news in Telangana
టాప్​ న్యూస్
author img

By

Published : Jan 9, 2022, 4:59 PM IST

  • 'యాసంగి ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సిందే'

Bhatti Vikramarka: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యాసంగి ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సిందేనని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క డిమాండ్​ చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ పంజాబ్‌లో చేసిన నాటకం ఆయన పదవిని దిగదార్చే విధంగా ఉందని ఆయన ఆరోపించారు. దళిత ముఖ్యమంత్రిని ఫెయిల్యూర్‌గా చూపెట్టి.. పంజాబ్‌లో రాష్ట్రపతి పాలన విధించాలని చూస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

  • ప్రధాని నాకు చెప్పిందదే'

Bandi Sanjay Comments: హనుమకొండలో ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యలపై భాజపా నిరసన సభ నిర్వహించింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ హాజరయ్యారు.

  • అన్నకు మహేశ్​ కన్నీటి వీడ్కోలు

Mahesh Babu: కరోనా కారణంగా రమేశ్ బాబు కడపటి చూపునకు దూరంగా ఉన్నారు నటుడు మహేశ్ బాబు. ట్విట్టర్​ వేదికగా అన్నతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకొని భావోద్వేగానికి లోనయ్యారు.

  • నలుగురు ఉగ్రవాదులు అరెస్ట్​

Nagpur Recce Case: నాగ్​పుర్​లో రాష్ట్రీయ స్వయం సేవక్​ సంఘ్​ ప్రధాన కార్యాలయం రెక్కీ కేసులో పోలీసులు కీలక పురోగతిని సాధించారు. ఈ కేసుతో సంబంధం ఉన్న జమ్ముకశ్మీర్​కు చెందిన నలుగురు ఉగ్రవాదులను అరెస్ట్​ చేశారు. వారి నుంచి భారీగా ఆయుధాలను, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.

  • గెంటేసిన 76 ఏళ్లకు..

Old lady legal battle against children: కన్నబిడ్డలపైనే న్యాయపోరాటానికి దిగి విజయం సాధించారు ఓ వృద్ధురాలు. 76 ఏళ్ల వయసులో కోర్టును ఆశ్రయించి.. తనకు అనుకూలమైన తీర్పు తెచ్చుకున్నారు. కర్ణాటకలో ఈ ఘటన జరిగింది.

  • తక్కువ ధరకే 'మ్యాంగో వైన్'​..

Mango Wine: అక్కడి ఎక్సైజ్​ శాఖ వినూత్న రీతిలో ఆలోచించింది. రాష్ట్ర ప్రజలకు మ్యాంగో వైన్​ అందుబాటులోకి తీసుకురానుంది. ఇందుకోసం మద్యం విధానాన్ని సవరించాలని ప్రభుత్వానికి ప్రతిపాదన కూడా పంపింది.

  • కట్టె తీసుకువెళ్తుంటే.. ఎడ్లబండిని కాల్చేశారు

Fire on Bullock cart: అటవీ శాఖ అధికారుల వైఖరితో ఓ నిరుపేద రైతు.. ఎడ్లబండితో పాటు తమ కుటుంబానికి ఆధారమైన ఎడ్లను పోగొట్టుకున్నారు. ఇంటిముందు పందిరి కోసం తన చేను పక్కనున్న కట్టెను తీసుకెళ్తుండగా అడ్డుకున్న అధికారులు.. ఈ ఘటనకు పాల్పడ్డారు.

  • వాటి​ ధరలకు రెక్కలు..!

Consumer Durables Price Hike: కొత్త ఏడాదిలో వినియోగదారులకు ఎలక్ట్రానిక్​ ఉత్పత్తుల సంస్థలు షాక్​ ఇవ్వనున్నాయి. గృహోపకరణాల ధరలు 5 నుంచి 10 శాతం వరకు పెరగనున్నట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఏసీలు, టీవీలు, ఫ్రిడ్జ్​ల ధరలు మరింత పెరగనున్నట్లు సంబంధిత సంస్థలు పేర్కొన్నాయి. ముడిసరకు ధరలు భారీగా పెరగడమే ఇందుకు కారణం అని వివరించాయి.

  • చైతూకు అన్నగా రెడీ

బంగార్రాజు' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న నాగార్జున.. 'మనం' తర్వాత కుమారుడు నాగచైతన్యతో ఈ సినిమాలో మరోసారి కలిసి నటించారు. అయితే భవిష్యత్​లో చైతూకు అన్న పాత్రలు చేయడానికైనా సరే తాను సిద్ధమని అన్నారు.

  • భారత్​లోనే ఐపీఎల్​..!

IPL 2022: వచ్చే ఐపీఎల్​ సీజన్ నిర్వహణ కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి సన్నాహాలు చేస్తోంది. భారత్​ వేదికగానే ఈ టోర్నీ నిర్వహించనుందని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఒకవేళ కొవిడ్​ వ్యాప్తి తీవ్రమైతే టోర్నీ నిర్వహణ కోసం ప్రత్యామ్నాయం ఆలోచిస్తామని అన్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.