ETV Bharat / city

నీట్​లో తెలుగు విద్యార్థుల సత్తా.. హైదరాబాద్ విద్యార్థినికి మూడో ర్యాంక్​

author img

By

Published : Oct 17, 2020, 5:30 AM IST

వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్​లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. వంద లోపు 30పైగా ర్యాంకులు సాధించారు. హైదరాబాద్​ విద్యార్థిని టి.స్నితక జాతీయ స్థాయిలో మూడో ర్యాంక్​ కైవసం చేసుకున్నారు.

NEET RANKERS
నీట్​లో తెలుగు విద్యార్థుల సత్తా.. హైదరాబాద్ విద్యార్థినికి మూడో ర్యాంక్​

వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్​లో తెలుగు విద్యార్థులు మరోసారి సత్తా చాటారు. వంద లోపు ర్యాంకుల్లో దాదాపు 30కిపైగా తెలుగు విద్యార్థులే సాధించారు.

హైదరాబాద్ విద్యార్థిని టి.స్నితక జాతీయ స్థాయిలో మూడో ర్యాంకు సాధించారు. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన జి.చైతన్య సింధు జాతీయ స్థాయిలో ఆరో ర్యాంకు కైవసం చేసుకున్నారు. హైదరాబాద్​కు చెందిన అనంత పరాక్రమ జాతీయ స్థాయిలో 11వ ర్యాంకు సాధించి.. ఎస్సీ విభాగంలో మొదటి స్థానంలో నిలిచారు. హైదరాబాద్ కు చెందిన సాయిత్రిషరెడ్డి 14వ ర్యాంకు సాధించారు.

తెలుగు రాష్ట్రాలకు చెందిన శేష సాత్విక్ శర్మ, కోట వెంకట్, మానస, షేక్ అర్ఫాత్ ఖదీర్, ఎ.శుభన్య్, అర్యశ్ అగర్వాల్, ఎం.రుషిత్, రోహిత్ శర్మ వందలోపు ర్యాంకులు సాధించిన వారిలో ఉన్నారు.

ఇవీచూడండి: నీట్​ పరీక్ష ఫలితాలు విడుదల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.