హైదరాబాద్‌కు చెందిన ఐదేళ్ల చిన్నారి ఓం అద్వైత్ తన రేసింగ్ స్కిల్స్‌తో.. నోబుల్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకున్నాడు. అద్వైత్ తండ్రి రాహుల్‌కు సైతం బైక్ రేస్‌లంటే మక్కువ. ఏడాది వయసునప్పుడే ఓ సారి తనతో పాటు తన కుమారుడిని ట్రాక్ వద్దకు తీసుకువెళ్లాడు. అప్పటి నుంచే అద్వైత్‌లో బైక్స్ పట్ల మక్కువ గమనించామంటారు తల్లిదండ్రులు. అలా కుమారుడికి మోటార్ స్పోర్ట్స్ మీద ఉన్న ఇష్టాన్ని గుర్తించి.. ఓం కోసం ప్రత్యేకంగా ఓ బైక్‌ని తెప్పించి ఇచ్చారు.
రేసింగ్ ట్రాక్‌లో ఓం దూకుడు..
Kids go karting : ప్రస్తుతం ఓం నడుపుతున్న ఈ బైక్ అదే. టూ స్ట్రోక్ 50 సీసీ కెపాసిటీ ఉన్న ఈ బైక్‌ను.. ఓంకు ఎత్తుకు తగిన విధంగా తయారు చేయించారు. అంతే అప్పటి నుంచి తన బైక్‌తో రేసింగ్ ప్రాక్టిస్ చేస్తున్న ఓం... రేసింగ్ ట్రాక్‌లో దూసుకుపోతున్నాడు. చిన్నారి సాహసాన్ని.. అద్భుతంగా చేస్తున్న రేసింగ్‌ను గుర్తించిన నోబుల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వారు అతి పిన్న వయస్కుడైన రేసర్‌గా సర్టిఫై చేశారు.
"మా నాన్న బైక్ నడపడం చూసి నాకు బైక్ రైడింగ్‌పై ఇష్టం కలిగింది. నేను కూడా బైక్ రైడ్ చేయాలని అనుకున్నాను. మా నాన్నకు చెప్పాను. నాన్న నా కోసం చిన్న బైక్ తీసుకొచ్చారు. అలా రేసింగ్ స్టార్ట్ చేశాను."
- ఓం అద్వైత్, మోటార్ రేసర్
"అద్వైత్ ఏడాది వయసున్నప్పుడు నేను రేసింగ్‌కు తీసుకెళ్లాను. వాడి రిమోట్ కారులో నడపడం నేర్చుకున్నాడు. నేను బైక్ రైడింగ్ చేయడం చూసి వాడికి కూడా రేసింగ్‌పై ఇష్టం కలిగింది. అప్పటి నుంచి నేను అద్వైత్ను రేస్ ట్రాక్‌లకు తీసుకెళ్లడం మొదలుపెట్టాను."
- రాహుల్, అద్వైత్ తండ్రి
గో కార్టింగ్‌లో అధర్వ అదుర్స్..
Kids in Motorsports : హైదరాబాద్‌కు చెందిన ఆరేళ్ల అధర్వ కూడా ఇటీవలే అతిపిన్న వయసులో.. గో కార్టింగ్ చేస్తున్న చిన్నారిగా నోబుల్ బుక్ ఆఫ్ రికార్డుల్లో స్థానం సంపాదించాడు. ఐదేళ్ల వయసులోనే కార్టింగ్ వైపు అడుగు వేసిన అధర్వ తండ్రి సహకారంతో.. నిత్యం కార్టింగ్ ప్రాక్టిస్ చేస్తున్నాడు. కార్ట్‌తో నిమిషాల వ్యవధిలో ల్యాప్‌లు పూర్తి చేయటం అధర్వ ప్రత్యేకత. అంత చిన్న వయసున్న వారు కార్టింగ్ చేయటం అంటే సులభం కాదు. ట్రాక్‌పై స్పీడ్‌గా వెళ్తూనే.. అకస్మాత్తుగా వచ్చే మలుపుల వద్ద అప్రమత్తంగా ఉండాలి. కానీ ఈ చిన్నారి మాత్రం ఆ ఫీట్స్‌ను అద్భుతంగా చేస్తూ ఔరా అనిపిస్తున్నాడు. కార్టింగ్ చేసేప్పుడు పెద్దవారికి సైతం మలుపుల వద్ద కాస్త భయం కలగటం సహజమే కానీ తనకు మాత్రం ఏం భయం లేదని.. కార్టింగ్ చేయటం చాలా మంచి ఫీల్‌ను ఇస్తుందని చెబుతూ ఆకట్టుకుంటున్నాడు ఈ చిన్నారి.
"నాకు గో కార్టింగ్ అంటే చాలా ఇష్టం. నేను నాన్నను అడిగాను.. నాన్న నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు. సంవత్సరం నుంచి నేను గో కార్టింగ్ చేస్తున్నాను. స్పీడ్‌గా వెళ్తుంటే భలే మజాగా ఉంటుంది. నాకస్సలు భయం వేయదు."
- అధర్వ, గో కార్టింగ్ రైడర్
"2 ఏళ్ల వయస్సున్నప్పుడు వాడికి కారు రేసింగ్‌పై ఇష్టాన్ని గమనించాను. మా ఇంటి పక్కన ఉన్న గోకార్టింగ్ సెంటర్‌కు తీసుకెళ్లాను. అక్కడ తాను గోకార్టింగ్ నేర్చుకున్నాడు. 5 ఏళ్ల వయసులో ఉన్న పిల్లలెవరు గో కార్టింగ్ చేయడం గురించి వినలేదు. ప్రపంచంలో ఈ వయసులో ఐదేళ్ల వయసులో గో కార్టింగ్ చేసిన ఏకైక చిన్నారి అధర్వనే అని తెలుసుకున్నాను. అందుకే రికార్డ్ బుక్ చేయాలని నోబుల్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌ను సంప్రదించాను."
- కార్తిక్, అధర్వ తండ్రి
మోటార్ స్పోర్ట్స్‌లో చిన్నారుల జోరు..
Kids Motor Race : ఒకటో తరగతి చదువుతున్న ఈ ఇద్దరు చిన్నారులు.. మోటార్ స్పోర్ట్స్‌లో సత్తా చాటడమే కాదు.. నచ్చిన విద్యలో నైపుణ్యం సాధించేందుకు వయసు అడ్డంకి కాదని నిరూపించారు. దానికి తల్లిదండ్రుల సహకారం తోడవటంతో మోటార్ స్పోర్ట్స్‌లో దూసుకుపోతున్నారు.
- ఇదీ చదవండి : సౌదీ ఎడారిలో కళ్లు చెదిరే రేస్