ETV Bharat / city

Ongole Bulls in Akhanda Movie : దుమ్మురేపిన ఒంగోలు గిత్తలు.. వెండితెరపై రంకెలు - తెలంగాణ లేటెస్ట్ అప్డేట్స్

Ongole Bulls in Akhanda Movie : సింహం గర్జిస్తే ఎద్దులు రంకెలేస్తాయా.? పిలిస్తే పరిగెత్తుకుంటూ వస్తాయా.? వస్తాయా ఏంటి? వచ్చేశాయి...! ఎందుకంటే అక్కడ గర్జించింది నందమూరి నటసింహం.! ఔను అఖండ సినిమాలో బాలయ్య బసవా అని పిలవడమే ఆలస్యం..! కొమ్ములు విసురుతూ కాలుదువ్వాయి.! ఇంతకీ అలా ఎలా చేశాయి? వాటికేమైనా శిక్షణ ఇచ్చారా? ఇస్తే ఎలా ఇచ్చారు? అసలు ఆ ఎద్దులు ఇప్పుడు ఎక్కడున్నాయి.? ఎలా ఉన్నాయి? చూద్దాం పదండి.

Ongole Cattle in Akhanda Movie, Akhanda Movie bulls
దుమ్మురేపిన ఒంగోలు గిత్తలు
author img

By

Published : Dec 5, 2021, 8:19 AM IST

Updated : Dec 6, 2021, 1:39 PM IST

దుమ్మురేపిన ఒంగోలు గిత్తలు.. వెండితెరపై రంకెలు

Ongole Bulls in Akhanda Movie : ఇవే.. అఖండ సినిమాలో బాలయ్య పిలవగానే రంకెలేసిన పోట్ల గిత్తలు...! చూపులో పౌరుషం, నడకలో రాజసం, కొమ్ముల్లో వాడిని వెండితెరపై ప్రదర్శించిన ఒంగోలు జాతిఎద్దులు.! బాలకృష్ణ 'బసవా' అనగానే దుమ్మురేపుతూ ఫ్రేమ్‌లోకి ఒక్కసారిగా దూసుకొచ్చి థియేటర్లను హోరెత్తించాయి. సినిమాలో అంతలా కట్టిపడేసిన ఈ ఎద్దులు ఆంధ్రప్రదేశ్​లోని గుంటూరు జిల్లాకు చెందినవే.!

ప్రత్యేక శిక్షణ..

Ongole Bulls in akhanda : అఖండ సినిమాలో ఆరంభ, ముగింపు సన్నివేశాలను ఈ గిత్తలు రక్తికట్టించాయి. బాలయ్య బసవా అని పిలవగానే కొమ్ములు విసురుతూ విలన్ల భరతం పట్టాయి. కథలో బసవన్నలు కీలకం కావటంతో దర్శకుడు బోయపాటి శ్రీను గుంటూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో ఆరా తీశారు. వెతకబోయిన తీగ కాలికి తగిలినట్లు బోయపాటి పక్కఊరైన కొప్పురావూరులోనే ఇవి కనిపించాయి. ఇక అంతే బోయపాటి అడగం, యజమాని సరే అనడం, సీన్లు చిత్రీకరించడం జరిగిపోయాయి. కాకపోతే వేగంగా పరిగెత్తడం, ఆగడంపై గిత్తలకు శిక్షణ ఇచ్చాకే కెమెరా ముందుకు తీసుకెళ్లారు.

బండలాగుడు పోటీలకూ సైతం..

శ్రీనివాసరావుకు చెందిన మొత్తం 4ఎద్దుల్ని అఖండ సినిమా చిత్రీకరణలో వినియోగించారు. వాటిలో ఒకదానిని అమ్మేయగా, మరొకటి అనారోగ్యంతో చనిపోయింది. సినిమా చూసివాళ్లు... గిత్తలను మెచ్చుకుంటున్నారని యజమాని మురిసిపోతున్నారు. 16 ఏళ్లుగా ఒంగోలు గిత్తలను పెంచుతున్న శ్రీనివాసరావు.. బండ లాగుడు పోటీలకు వాటిని తీసుకెళ్తుంటారు.

ఇవీ చదవండి.

Last Updated : Dec 6, 2021, 1:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.