బంగాళాఖాతంలో తమిళనాడు తీరానికి దగ్గర 4.5 కిలోమీటర్ల ఎత్తు వరకూ ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. అండమాన్ దీవుల ప్రాంతంలో 1.5 కి.మీ.ల నుంచి 4.5 కి.మీ.ల మధ్య మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో శనివారం బంగాళాఖాతం తూర్పు, మధ్య ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయి. ఆ తరవాత రెండు రోజుల్లో ఇది బంగ్లాదేశ్ తీరం వైపు ప్రయాణించే అవకాశముంది.
తెలంగాణలో శని, ఆదివారాల్లో పొడి వాతావరణం ఉంటుందని, వర్షాలు పడే అవకాశం లేదని వాతావరణ అధికారి రాజారావు తెలిపారు. రాత్రిపూట 17 డిగ్రీల వరకూ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. హైదరాబాద్‌లో గాలిలో తేమ సాధారణంకన్నా 13 శాతం అధికంగా ఉంది.