ETV Bharat / city

టాప్​ టెన్​ న్యూస్​ @7PM - తెలంగాణ ప్రధాన వార్తలు

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

టాప్​ టెన్​ న్యూస్​ @7PM
టాప్​ టెన్​ న్యూస్​ @7PM
author img

By

Published : Jan 7, 2022, 6:57 PM IST

  • 'థర్డ్​వేవ్​ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి'

Covid Third wave: కరోనా థర్డ్​ వేవ్​ను ఎదుర్కొనేందుకు అందరూ సిద్ధంగా వైద్యాధికారులకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్​రావు స్పష్టం చేశారు. రెండో డోసు లక్ష్యాన్ని వంద శాతం పూర్తిచేయడం సహా 15-18 ఏళ్ల వారికి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేయాలన్నారు. కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో డైరెక్టర్​ ఆఫ్​ హెల్త్​ శ్రీనివాసరావుతో కలిసి.. అన్ని జిల్లాల వైద్యాధికారులు, ఆశావర్కర్లతో మంత్రి హరీశ్​ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.

  • ఆడపిల్ల పుడుతుందని మనోవేదనతో గృహిణి ఆత్మహత్య

Pregnant suicide: అమ్మ కాబోతుంటే ఏ మహిళ ఆనందానికి అవధులు ఉండవు. పండంటి బిడ్డ పుట్టబోతుందని పండంటి కలలు కనటం సహజం. తన బిడ్డ ఇలా ఉంటుంది.. అలా ఉంటుంది అని.. తల్లులు కలలు కంటూ ఉంటారు. క్షణక్షణం ఆ అనుభూతుల గురించి ఆలోచిస్తూ ఉంటారు. కానీ ఈ తల్లి మాత్రం భయం నీడలో బతికింది. తొలి సంతానం ఆడపిల్ల పుట్టిందని.. మళ్లీ ఇప్పుడు ఆడపిల్లే పుడితే అత్తింటి వారి నుంచి ఎలాంటి చీత్కారాలు ఎదుర్కోవాల్సి వస్తుందనే మనస్తాపంతో తన ప్రాణాలనే బలితీసుకుంది.

  • 'అక్కడి నుంచే పోటీ చేస్తా.. మళ్లీ సీఎం అవుతా'

CBN Fires On YSRCP Govt: వైకాపా నాయకులకు రాజకీయాలు తప్ప మరో ధ్యాస లేదని తెదేపా అధినేత చంద్రబాబు ఆరోపించారు. ప్రజా సమస్యలపై పోరాడేవారిని వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లోనూ కుప్పం నుంచే పోటీ చేసి.. మళ్లీ సీఎం అవుతానని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు.

  • ప్రధాని భద్రత అందుకే అంత కట్టుదిట్టం!

PM Modi Security: ప్రధాని నరేంద్ర మోదీ పంజాబ్​ పర్యటనలో జరిగిన భద్రతా వైఫల్యంతో ప్రధాని సెక్యూరిటీ ఏర్పాట్లపై ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో గతంలో జరిగిన భద్రతా వైఫల్యాలు, ప్రధానికి భద్రతను ఇచ్చే 'స్పెషల్‌ ప్రొటెక్షన్‌ గ్రూప్‌' పనితీరు గురించి తెలుసుకుందాం.

  • ఒక్కరోజులోనే కరోనా కేసులు డబుల్

దేశంలో కరోనా తీవ్ర రూపం దాల్చుతోంది. కొత్త కేసులు లక్ష దాటేశాయి. కేసులు 10 రోజుల వ్యవధిలో 13 రెట్లు పెరిగి, ఆందోళన కలిగిస్తున్నాయి. మూడో వేవ్‌కు ఆజ్యం పోస్తున్న కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు మూడు వేలకు పెరిగాయి. ఈ మేరకు శుక్రవారం కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలను వెల్లడించింది.

  • 30 ఏళ్లలోపే ఆరోగ్య బీమా తీసుకోండి.. ఎందుకంటే..?

Health Insurance Plans: కొవిడ్​ ప్రభావంతో ఆరోగ్య బీమాపై చాలా మంది దృష్టిసారిస్తున్నారు. వీటిని 30 ఏళ్లలోపే తీసుకుంటే మంచిదని సూచిస్తున్నారు నిపుణులు. మరి దాని వల్ల పొందే ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం.

  • ఇన్​స్టంట్​ లోన్​ తీసుకుంటున్నారా? ఇవి తెలుసుకోండి!

Instant Personal Loan: అవసరానికి అప్పు తీసుకోవాలంటే ఒకప్పుడు ఎన్నో రోజులు పట్టేది. ఎన్నో కాగితాలు సమర్పించాల్సి వచ్చేది. మారుతున్న డిజిటల్‌ యుగంలో రుణాల తీరూ మారిపోయింది. దేశంలో ఎన్నో ఫిన్‌టెక్‌ సంస్థలు అప్పులిచ్చేందుకు సిద్ధమవడంతో క్షణాల్లోనే అవసరమైన నగదు బ్యాంకు ఖాతాలో జమ అవుతోంది. ఏదైనా అత్యవసరం వచ్చి, ఈ 'ఇన్‌స్టంట్‌ లోన్ల'ను తీసుకునేముందు పరిశీలించాల్సిన విషయాలూ కొన్ని ఉంటాయి.

  • 'ఆ ఇద్దరూ నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు'

Gavaskar on Pujara and Rahane: భారత జట్టు సీనియర్​ బ్యాటర్లు ఛెతేశ్వర్ పుజారా, అజింక్య రహానే.. తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నారని అన్నాడు బ్యాటింగ్ దిగ్గజం సునీల్ గావస్కర్. దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టులో ఇద్దరు ఆటగాళ్లు బ్యాటింగ్​తో రాణించారని ప్రశంసించాడు.

  • ''రాధేశ్యామ్​' కోసం ఎంతో కష్టపడ్డా'

ప్రభాస్‌-పూజాహెగ్డే జంటగా నటించిన ప్రేమకథా చిత్రం 'రాధేశ్యామ్‌'. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్రబృందం భావించింది. అయితే, దేశవ్యాప్తంగా కరోనా ఉద్ధృతి నేపథ్యంలో మరోసారి వాయిదా పడింది. ఈ నేపథ్యంలో ఇటీవలే ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పూజా హెగ్డే పలు ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు.

  • సెలబ్రిటీలను వదలని కరోనా

కరోనా.. విరామం.. కరోనా..విరామం.. కరోనా.. ఇలా ప్రజల్ని ముప్పతిప్పలు పెడుతోందీ మహమ్మారి. మొదటి దశ, రెండో దశలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న జనాలు మళ్లీ మూడో దశకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే దేశంలో రోజుకు లక్షకుపైగా కేసులు నమోదవుతున్నాయి. దీంతో సామాన్య ప్రజలతో పాటు సెలబ్రిటీలు అప్రమత్తమవుతున్నారు. గత రెండు దశల్లో పలువురు ప్రముఖులు ఈ మహమ్మారి బారినపడగా.. తాజాగా బాలీవుడ్, టాలీవుడ్​కు చెందిన కొందరికి వైరస్ సోకింది. ఇలా ఈ మూడో దశలో కరోనా బారినపడిన ప్రముఖులెవరో చూద్దామా!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.