ETV Bharat / city

టాప్​ టెన్​ న్యూస్​ @5PM - తెలంగాణ వార్తలు

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

టాప్​ టెన్​ న్యూస్​ @5PM
టాప్​ టెన్​ న్యూస్​ @5PM
author img

By

Published : Jan 7, 2022, 4:59 PM IST

  • ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త

ప్రభుత్వ ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. గత కొన్ని నెలలుగా జరుగుతున్న సుదీర్ఘ చర్చల అనంతరం ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం పీఆర్‌సీపై నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు 23.29 శాతం పీఆర్‌సీని ప్రకటిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసకుంది. ఉద్యోగుల పదవీ విరమణ వయసు 60 నుంచి 62 ఏళ్లుకు పెంచుతూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. పెంచిన జీతాలు 2022 జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి.

  • 'కేసీఆర్ లాంటి పిరికి సీఎంను ఎక్కడా చూడలేదు'

Shivraj Singh Chouhan on KCR: తెలంగాణలో ధర్మయుద్ధం మొదలైందని భాజపా జాతీయ నేత, మధ్యప్రదేశ్​ సీఎం శివరాజ్​ సింగ్​ చౌహాన్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో భాజపా అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేసారు. బండి సంజయ్‌ పోరాటస్ఫూర్తిని ప్రదర్శించారని అభినందించారు. కేసీఆర్​ పిరికివాడని.. ఇలాంటి సీఎంను తానెక్కడ చూడలేదని ఆయన అన్నారు.

  • ఎంపీ అర్వింద్​పై చర్యలొద్దు: హైకోర్టు

hc on mp Arvind : సామాజిక మాధ్యమాల్లో అభ్యంతరకర పోస్టులు పెట్టొద్దని ఎంపీ అర్వింద్‌ను హైకోర్టు ఆదేశించింది. సీఎం కేసీఆర్‌ను కించపరిచే పోస్టులు పెట్టారని బంజారాహిల్స్‌లో అర్వింద్‌పై కేసు నమోదైంది. తనపై నమోదైన కేసును కొట్టివేయాలని ఎంపీ అర్వింద్​ హైకోర్టును ఆశ్రయించారు. అతడి పిటిషన్​పై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. అర్వింద్‌పై కఠిన చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది.

  • 'ఆ ప్రయాణికులకు హోం క్వారంటైన్​ తప్పనిసరి'

Home Quarantine: భారత్​కు వచ్చిన ప్రయాణికులకు 7 రోజుల పాటు హోం క్వారంటైన్​ను తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేసింది కేంద్రం. ఒమిక్రాన్​ వ్యాప్తి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది.

  • 'పంజాబ్ ఇష్యూ'పై భాజపా నయా గేమ్​ప్లాన్​

BJP nationwide campaign against Congress: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పంజాబ్‌ పర్యటనలో తలెత్తిన భారీ భద్రతా వైఫల్య వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో ఇదే అజెండాగా కాంగ్రెస్​ను ఇరుకున పెట్టేందుకు పక్కా ప్లాన్​తో ముందుకు సాగుతోంది భాజపా. జాతీయ స్థాయిలో కాంగ్రెస్​కు వ్యతిరేకంగా ఉద్యమించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలుచోట్ల నిరసన వ్యక్తం చేస్తున్నారు భాజపా నేతలు.

  • ఆ ఏనుగుకు రేషన్ బియ్యం మహా ఇష్టం

Elephant Attack in Kerala: కేరళ ఇడుక్కి జిల్లాలోని ఓ​ ప్రాంతంలో ఏనుగు బీభత్సం సృష్టిస్తోంది. రేషన్ ​దుకాణాలపై దాడి చేసి.. బియ్యాన్ని తినేస్తుంది. దీంతో బియ్యం అందక ఆ ప్రాంత ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

  • రోబోతో పెద్దాయన ప్రేమాయణం- త్వరలోనే వివాహం!

Love With Humanoid Robot: రోబో.. మనిషిని ప్రేమించి పెళ్లి చేసుకుంటాను అని అనడం దర్శకుడు శంకర్​ తీసిన సినిమాలో చూశాం. అది కల్పితం. కానీ నిజ జీవితంలో కూడా ఓ మనిషి మరమనిషితో ప్రేమలో పడిన ఘటన ఆస్ట్రేలియాలో జరిగింది. ఏకంగా పెళ్లి కూడా చేసుకోవాలని అనుకుంటున్నాడు ఆ వ్యక్తి.

  • వారాంతంలో మార్కెట్లకు లాభాలు

Stock Market Closing: దేశీయ స్టాక్​ మార్కెట్​ సూచీలు వారాంతంలో లాభాల్లో ముగిశాయి. ఇంట్రాడేలో తీవ్ర ఒడుదొడుకులకు లోనయినా.. చివరకు పుంజుకున్నాయి. సెన్సెక్స్​ 143, నిఫ్టీ 67 పాయింట్ల చొప్పున పెరిగాయి.

  • 'జకోవిచ్​ను నేరస్థుడిలా చూడకండి.. మంచి వసతి కల్పించండి'

Novak Djokovic Visa: సెర్బియా టెన్నిస్ స్టార్ నొవాక్ జకోవిచ్ వీసాను ఆస్ట్రేలియా ప్రభుత్వం రద్దు చేసిన అంశం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో అతడిని మంచి హోటల్​లోకి తరలించాలని సెర్బియా సర్కారు ఆస్ట్రేలియా ప్రభుత్వాన్ని కోరింది.

  • నటి స్వర భాస్కర్ సహా స్టార్​ సింగర్​కు కరోనా

Swara Bhaskar Covid: బాలీవుడ్​లో కరోనా కలకలం కొనసాగుతూనే ఉంది. శుక్రవారం మరో ముగ్గురు స్టార్​లకు కొవిడ్​ పాజిటివ్​గా తేలింది. వారిలో నటి స్వర భాస్కర్, ప్రముఖ సింగర్ విశాల్ దడ్లానీ ఉన్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.