మొండెం లేని తల... కుక్క పనేనా?
చర్చి దగ్గర ఓ మొండెం లేని తల కనిపించడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. ఎవరైనా హత్య చేసి ఇక్కడ పడేశారా? అనే కోణంలో దర్యాప్తు ప్రారంభించగా అసలు విషయం బయటపడింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
భద్రతలో నిర్లక్ష్యం.. 'రైల్వే'నే నిదర్శనం..!
బిహార్‌లోని దర్భంగా పేలుళ్ల ఘటనలో హైదరాబాద్ మూలాలున్నాయని తేలటంతో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ భద్రతపై పలు విమర్శలు తలెత్తుతున్నాయి. ఘటన వెనుక ఉగ్ర కుట్ర కోణాలున్నాయని ఎన్‌ఐఏ విచారణలో వెల్లడవుతోంది. ఇంత జరుగుతున్నా.. రైల్వేపరంగా ఎలాంటి అప్రమత్తత లేదు. పార్సిల్ బుకింగ్ ఎప్పటిలాగే నిర్లక్ష్యంగా కొనసాగుతోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
సరిహద్దులో మరోసారి డ్రోన్ల కలకలం
సరిహద్దులో మరోసారి డ్రోన్లు ప్రత్యక్షమయ్యాయి. జమ్మూలోని అర్నియా సెక్టార్లో శుక్రవారం తెల్లవారుజామున ఓ డ్రోన్‌ను అధికారులు గుర్తించారు. డ్రోన్ ద్వారా సరిహద్దులో పాకిస్థాన్ రెక్కీ నిర్వహిస్తున్నట్లు భద్రతాదళాలు భావిస్తున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
ఉత్తరాఖండ్‌కు కొత్త సీఎం?
కొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఉత్తరాఖండ్‌లో రాజకీయాలు మారోమారు రసవత్తరంగా మారాయి. ముఖ్యమంత్రి మార్పుపై ఊహాగానాలు మొదలయ్యాయి. ఇటీవల సీఎం తీరథ్ సింగ్ రావత్.. అత్యవసరంగా దిల్లీకి వెళ్లటం అందుకు ఆజ్యం పోసినట్లయింది. అధికారం చేపట్టిన మూడు నెలలకే ముఖ్యమంత్రి మార్పు అంశం తెరపైకి ఎందుకు వచ్చింది? రాష్ట్రంలో మరోమారు సీఎం మార్పు తప్పదా? అసలు కారణాలేంటి? పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
తొలిసారిగా అంతరిక్షంలోకి తెలుగమ్మాయి!
స్పేస్‌లో తొలిసారి ఓ తెలుగమ్మాయ్ విహరించబోతుంది. వర్జిన్ గెలాక్టిక్ సంస్థ ఈనెల 11న 'యూనిటీ-22' పేరుతో అంతరిక్ష వాహననౌకను ప్రయోగించనున్నట్లు ఆ సంస్థ అధిపతి సర్ రిచర్డ్ బ్రోన్సన్ తెలిపారు. రిచర్డ్‌తో పాటు మరో ముగ్గురు ప్రయాణించనుండగా... వారిలో తెలుగు మూలాలు ఉన్న శిరీషకు చోటు దక్కింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
కీలక ప్రాంతాన్ని ఖాళీ చేసిన అమెరికా
అఫ్గానిస్థాన్‌లో తమ బలగాలకు కేంద్ర బిందువుగా చేసుకుని కార్యకలాపాలు సాగిస్తున్న కీలక ఎయిర్‌ఫీల్డ్‌ను దాదాపు 20 ఏళ్ల తర్వాత ఖాళీ చేసింది అమెరికా. అఫ్గాన్ రక్షణ శాఖకు అప్పగించినట్లు అగ్రరాజ్య అధికారులు తెలిపారు. అయితే.. బలగాలను తరలిస్తున్నప్పటికీ వాయుదాడులు కొనసాగుతాయని స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
కరోనాతో క్షయ పునరుత్తేజితం అవుతుందా?
కరోనా.. ఒంట్లో నిద్రాణంగా ఉన్న క్షయను సైతం తిరిగి ప్రేరేపితం చేసే ప్రమాదముందని పరిశోధకులు వెల్లడించారు. కొవిడ్-19 కారక సార్స్-కొవీ2 నిద్రాణ క్షయను పునరుత్తేజితం చేసే మూలకణ మాధ్యమ రక్షణ వ్యవస్థను ప్రేరేపించే అవకాశముందని ఐఐటీ గువాహటి, యూనివర్సిటీ ఆఫ్ మసాచుసెట్స్ నిర్వహించిన అధ్యయనం చెబుతోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
స్టాక్ మార్కెట్లో లాభాలు రావాలంటే?
స్టాక్ మార్కెట్... ఇప్పుడు చాలామంది దీని గురించే మాట్లాడుకుంటున్నారు.. అందులో పెట్టుబడుల గురించి ఆలోచిస్తున్నారు. మార్కెట్ సూచీలు రికార్డులు సృష్టిస్తున్న నేపథ్యంలో కొత్త మదుపరులు గతంలో ఎన్నడూ లేని విధంగా మార్కెట్లోకి ప్రవేశిస్తున్నారు. అప్పులు చేసి మరీ మదుపు చేస్తున్న వారూ ఉంటున్నారు. అయితే, నష్ట భయం ఉన్న స్టాక్ మార్కెట్లో ఏ వ్యూహాలు పాటించాలి.. అనేది తెలుసుకున్నప్పుడే.. లాభాలు కళ్లచూడగలం. అందుకోసం ఏం చేయాలి? చూద్దామా! పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
ఇద్దరు ఆటగాళ్లపై ఐసీసీ నిషేధం
అవినీతికి పాల్పడిన ఇద్దరు యూఏఈ ఆటగాళ్లపై నిషేధం విధించింది ఐసీసీ. 2019 టీ20 ప్రపంచకప్ సందర్భంగా నిర్వహించిన క్వాలిఫయింగ్ మ్యాచ్‌ల్లో పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారాయని అవినీతి నిరోధక విభాగం తేల్చి చెప్పింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
రష్మిక.. తప్పు తెలుసుకుని!
స్టార్ హీరోయిన్ రష్మిక మాస్క్ మరిచిపోయి అయోమయంలో పడింది. వెంటనే తన తప్పు తెలుసుకుని మాస్క్ పెట్టుకుని మీడియాతో మాట్లాడింది. ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.