ETV Bharat / city

టాప్​టెన్​ న్యూస్​@3PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

టాప్​టెన్​ న్యూస్​@3PM
టాప్​టెన్​ న్యూస్​@3PM
author img

By

Published : Dec 30, 2020, 2:59 PM IST

ఈ ఏడాదిలో నేరాలు తగ్గాయ్..

రాష్ట్రంలో గతేడాదితో పోలిస్తే ఈ సంవత్సరం అన్నిరకాల నేరాలు తగ్గాయని డీజీపీ మహేందర్‌రెడ్డి ప్రకటించారు. 2020 రాష్ట్ర వార్షిక నేర నివేదికను విడుదల చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

రాజధానిలో సంచలనం సృష్టించిన కేసులివే..!

రాష్ట్ర రాజధాని హైదరాబాద్​లో పోలీస్​ విభాగం ఈ ఏడాది కాలంలో ప్రభావంతంగా పనిచేసి ప్రశంసలు అందుకున్నారు. ఈ ఏడాది నేరాల సంఖ్య అంతకు ముందు ఏడాదితో పోలిస్తే తగ్గగా.. ఆర్థిక, సైబర్​ నేరాలు మాత్రం గణనీయంగా పెరిగాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

భాజపా బేజారు

'మారుస్తాం.. అన్నీ మారుస్తాం' అంటూ తమిళ ప్రాంతీయ పార్టీల గుండెల్లో తుపాను రేపిన సూపర్​స్టార్​ 'రాజకీయం' మొత్తానికి ఏ అలజడి లేకుండా విశ్రాంతి తీరం చేరింది. రాజకీయాల్లోకి రాకుండానే గుడ్​బై చెప్తూ రజనీ చేసిన సంచలన ప్రకటన అటు అభిమానులతో పాటు భాజపాను తీవ్ర నిరాశకు గురిచేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

రైతుల సంఘాల నేతలతో కేంద్రం చర్చలు

నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీ సరిహద్దులో ఆందోళన చేస్తున్న రైతులకు, కేంద్ర ప్రభుత్వానికి మధ్య చర్చలు ప్రారంభమయ్యాయి. దిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌, పీయూష్ గోయల్​తో రైతు సంఘాల ప్రతినిధులు సమావేశమయ్యారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

న్యూఇయర్ వేడుకలపై..

న్యూఇయర్ సంబరాలపై నిఘా ఉంచాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. ప్రజలు గుమిగూడకుండా నివారించాలని పేర్కొంది. కరోనాను దృష్టిలో ఉంచుకొని సూపర్ స్ప్రెడర్​గా మారే అవకాశం ఉన్న కార్యక్రమాలపై పర్యవేక్షణ పెంచాలని సూచించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

అమెరికాకూ కొత్త స్ట్రెయిన్..

బ్రిటన్​లో ఒక రోజే 50వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్​ వ్యాప్తి మరింత తీవ్రం అవనుందని అధికారులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు అమెరికాలో తొలి కొత్త రకం కరోనా కేసు నమోదైంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

జనవరి నుంచి వచ్చే మార్పులివి..

నూతన సంవత్సరంలో వాణిజ్య రంగంలో పలు మార్పులు రానున్నాయి. ఇంతకీ ఏంటవి? వాటి వల్ల చేకూరే ప్రయోజనాలేంటి? పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

మంచి కొలెస్ట్రాల్​ స్థాయిని పెంచుకోండిలా..

నియాసిన్​(విటమిన్​ బి3)​ వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. మంచి కొలెస్ట్రాల్ స్థాయులు పెరగటానికి చికిత్సలో భాగంగా డాక్టర్లు దీన్నే సూచిస్తుంటారు. ఇది మెండుగా లభించే ఆహార పదార్థాలేంటి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

జట్టులోకి రోహిత్​..

మూడో టెస్టుకు రోహిత్ శర్మ జట్టులోకి వస్తే ఇప్పుడున్న వారిలో ఎవరిని తప్పిస్తారు? హిట్​మ్యాన్​ ఏ స్థానంలో బరిలో దిగుతాడు? గత ఫామ్​ను కొనసాగిస్తాడా? అనేవి అందరికి వస్తున్న ప్రశ్నలు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ఆ బయోపిక్​లో నటించట్లేదు

తమిళనాడు రాణి బయోపిక్​లో తాను నటించట్లేదని నయనతార వెల్లడించింది. అవన్నీ పుకార్లేనని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.