ETV Bharat / city

తొలిరోజు 139 కేంద్రాల్లో టీకా.. యుద్ధప్రాతిపదికన సన్నాహాలు

author img

By

Published : Jan 10, 2021, 4:16 AM IST

ఎన్నాళ్ల నుంచో ఎదురుచూస్తున్న కొవిడ్‌ టీకా పంపిణీకి తేదీ ఖరారు కావడంతో.. వైద్యఆరోగ్యశాఖ యుద్ధప్రాతిపదికన సన్నాహాలు మొదలుపెట్టింది. ఈనెల 16న దేశవ్యాప్తంగా టీకా వేసే కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించడంతో.. రాష్ట్రంలోనూ ఆరోగ్యశాఖ సమాయత్తమవుతోంది.

Telangana state govt ready to distribute covid vaccine from 16th January
తొలిరోజు 139 కేంద్రాల్లో టీకా.. యుద్ధప్రాతిపదికన సన్నాహాలు

తొలిరోజు (వచ్చే శనివారం) రాష్ట్రంలోని 139 కేంద్రాల్లో టీకాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఇందులో రెండు కేంద్రాల్లో వైద్యసిబ్బందితో ప్రధానమంత్రి నరేంద్రమోదీ దృశ్యమాధ్యమంలో నేరుగా మాట్లాడనున్నారు. ఈ కేంద్రాలు ఎక్కడ అనేది మాత్రం ఇంకా నిర్ధారణ కాలేదు. ఇంటర్నెట్‌ కనెక్టివిటీ వేగంగా ఉన్న ప్రదేశాలను ఎంపిక చేసే అవకాశాలున్నాయి. ఈ రెండు కేంద్రాల్లో పెద్ద టీవీ తెరను ఏర్పాటు చేయనున్నట్లు వైద్యవర్గాలు తెలిపాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఒకటి గాంధీ ఆసుపత్రిలో నిర్వహించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. మరొకటి ప్రైవేటులో నిర్వహించాలా? వరంగల్‌ వంటి ప్రధాన నగరాల్లోని ప్రభుత్వ ఆసుపత్రిలోనా అనే విషయమై స్పష్టత లేదని వైద్యవర్గాలు తెలిపాయి.ప్రధానమంత్రి మాట్లాడేది వినడానికి వీలుగా అన్ని కేంద్రాల్లోనూ టీవీలు ఏర్పాటు చేస్తారు. 16న ప్రారంభ కార్యక్రమంలో రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాల్గొంటారా? లేదా? అనే విషయంలో కూడా స్పష్టత లేదని వైద్యవర్గాలు తెలిపాయి. 11న ప్రధానమంత్రితో టీకాల పంపిణీపై దృశ్య మాధ్యమ సమీక్షలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. అనంతరం అదేరోజు జిల్లా కలెక్టర్లతో సీఎం సమీక్ష సమావేశం నిర్వహించనునున్నారు. ఈ సమావేశంలో సీఎం పాల్గొనే విషయంపై స్పష్టత వస్తుందని వైద్యవర్గాలు చెబుతున్నాయి. వైద్యఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్‌ మాత్రం తొలిరోజు తాను టీకా తీసుకోనున్నట్లు ప్రకటించారు. వైద్యులు, నర్సులు, ఇతర వైద్యసిబ్బంది, ప్రజల్లో కొవిడ్‌ టీకాపై విశ్వాసం ప్రోదిగొల్పేందుకు సన్నద్ధమవుతున్నట్లు మంత్రి వెల్లడించారు.

తొలిరోజు 13,900 మందికి..

తొలిరోజు 139 కేంద్రాల్లో టీకా పంపిణీని చేపట్టినా.. తర్వాత క్రమేణా కేంద్రాల సంఖ్యను పెంచనున్నారు. వైద్యసిబ్బందికి అదనంగా పోలీసు, రెవెన్యూ, పురపాలక, సైనిక సిబ్బందికి కూడా ఇవ్వాల్సి వచ్చినప్పుడు.. కేంద్రాల సంఖ్యను 1500కు పెంచనున్నారు. ఒక్కో కేంద్రంలో రోజుకు 100 మంది చొప్పున టీకాలు పొందడానికి ఆరోగ్యశాఖ ఏర్పాట్లు చేసింది. ఈ లెక్కన తొలిరోజు 139 కేంద్రాల్లో సుమారు 13,900 మందికి టీకాలు ఇవ్వనున్నారు. మొత్తంగా తొలుత 2.90 లక్షల మంది ప్రభుత్వ, ప్రైవేటు వైద్యసిబ్బందికి కొవిడ్‌ టీకాలు వేయనున్నారు. ఆ తర్వాత సుమారు 2 లక్షల మంది పోలీసు, రెవెన్యూ, పురపాలక సిబ్బందికి టీకా ఇస్తారు. అనంతరం సుమారు 64 లక్షల మంది 50 ఏళ్లు పైబడినవారికి, సుమారు 6 లక్షల మంది 18-50ఏళ్ల మధ్య వయస్కుల్లో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారికి కొవిడ్‌ టీకా ఇస్తారు. ఈ అన్ని కేటగిరీల వారికి కూడా ఉచితంగానే టీకా వేస్తారు. ప్రస్తుతానికి మాత్రం వైద్యసిబ్బంది జాబితాపై మాత్రమే స్పష్టత ఉంది. 2.90 లక్షల మంది వైద్యసిబ్బందికి సుమారు 7-10 రోజుల్లో తొలిడోసు పూర్తి చేయాలని నిర్ణయించినట్లుగా వైద్యఆరోగ్యశాఖ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. తొలిడోసు పొందిన 28 రోజులకు రెండో డోసునిస్తారు. తొలిరోజు నిర్వహించనున్న 139 కేంద్రాలను మొత్తం 33 జిల్లాల్లోనూ ఏర్పాటు చేస్తారు. ప్రధానంగా జీహెచ్‌ఎంసీలో సుమారు 50కి పైగానే ఏర్పాటు చేయనున్నారు. మిగిలిన వాటిని జిల్లాకు ఒకటి, రెండు చొప్పున నెలకొల్పనున్నారు. సుమారు 50 వరకూ ప్రైవేటు ఆసుపత్రులూ ఉంటాయని, ముఖ్యంగా 100 మందికి పైగా వైద్యసిబ్బంది ఉండే ప్రైవేటు ఆసుపత్రుల్లో ఈ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నామని వైద్యవర్గాలు తెలిపాయి. ఇందులోనూ జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 40 వరకూ ప్రైవేటు ఆసుపత్రులుండే అవకాశాలున్నాయి. మిగిలినవాటిలో వరంగల్‌, కరీంనగర్‌, ఖమ్మం వంటి చోట్ల ఒకటి, రెండు చొప్పున ప్రైవేటు ఆసుపత్రుల్లో టీకా పంపిణీ కేంద్రాలను నెలకొల్పనున్నారు.
సర్వసన్నద్ధంగా..
శనివారం కేంద్ర క్యాబినెట్‌ కార్యదర్శి నిర్వహించిన దృశ్యమాధ్యమ సమీక్షలో శుక్రవారం నాటి డ్రైరన్‌లో ఎదురైన సాంకేతిక సమస్యలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, వైద్యఆరోగ్యశాఖ కార్యదర్శులు కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. మరోవైపు టీకాల పంపిణీ తేదీ ఖరారు కావడంతో రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ యుద్ధప్రాతిపదికన సత్వర ఏర్పాట్లపై దృష్టిపెట్టింది. శనివారం రాత్రి వైద్యఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. డ్రైరన్‌లో గుర్తించిన లోటుపాట్లను చక్కదిద్దాలని, టీకాల పంపిణీకి సర్వసన్నద్ధం కావాలని అధికారులను ఆదేశించారు.

పంపిణీ ప్రక్రియ ఇలా..

  • 16న శనివారం ప్రారంభం
  • 17న ఆదివారం సెలవు. ఆ రోజున దేశవ్యాప్తంగా పల్స్‌ పోలియో నిర్వహిస్తున్నారు.
  • 18న సోమవారం నుంచి తిరిగి కొవిడ్‌ టీకాల పంపిణీ ప్రక్రియ మొదలు
  • వారంలో నాలుగు రోజులే (సోమ, మంగళ, గురు, శుక్రవారాల్లో)టీకా వేస్తారు.
  • బుధ, శనివారాల్లో సార్వత్రిక టీకా కార్యక్రమాలు యథావిధిగా కొనసాగుతాయి. ఈ రెండు రోజుల్లో కొవిడ్‌ టీకా పంపిణీ ఉండదు.
  • ప్రతి రోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ టీకా వేస్తారు.
  • టీకా పొందనున్న లబ్ధిదారులకు సంక్షిప్త సమాచారం అందుతుంది. ఎవరు ఎప్పుడు ఏ కేంద్రానికి ఏ సమయంలో రావాలో అందులో స్పష్టంగా ఉంటుంది.

కొత్త అతి శీతల పరికరం రాక

కొవిడ్‌ టీకాలను భద్రపరిచే కొత్త అతి శీతల పరికరం రాష్ట్రానికి శనివారం వచ్చేసింది. కోఠిలోని ఆరోగ్య కార్యాలయంలో ప్రాంగణంలో దీన్ని అమర్చారు. 40 క్యూబిక్‌ మీటర్ల సామర్థ్యమున్న వాకిన్‌ కూలర్‌ అందుబాటులోకి రావడంతో.. టీకాల నిల్వ సామర్థ్యం మరింత పెరిగినట్లు వైద్యవర్గాలు తెలిపాయి. రాష్ట్ర స్థాయి నిల్వ కేంద్రంలో సుమారు 1.5 కోట్ల డోసుల టీకాలను, జిల్లాల్లో మరో 1.5 కోట్ల డోసుల టీకాలను భద్రపర్చుకోవడానికి మార్గం సుగమమైంది. ఈనెల 12న(మంగళవారం) రాష్ట్రానికి సుమారు 6.5 లక్షల డోసుల కొవిడ్‌ టీకాలు అందుబాటులోకి రానున్నట్లు వైద్యవర్గాలు తెలిపాయి. ఇవి రాష్ట్రానికి చేరగానే.. కేంద్ర కార్యాలయం నుంచి అన్ని జిల్లాలకూ అతి శీతల పరికరాలున్న వాహనాల ద్వారా తరలిస్తారు. జిల్లాల నుంచి టీకా పంపిణీ కేంద్రాలకు ప్రత్యేక వాహనాల్లో తీసుకెళ్తారు. ఇందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను ఇప్పటికే పూర్తిచేసినట్లు వైద్యవర్గాలు తెలిపాయి.

ఇవీ చూడండి: మొదటి కరోనా వ్యాక్సిన్ నేనే తీసుకుంటా: మంత్రి ఈటల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.