ETV Bharat / city

డాక్టర్ల రక్షణ కోసం వాట్సాప్ గ్రూపులు

వైద్యులకు రక్షణ కల్పించేందుకు పోలీసుశాఖ చర్యలు చేపట్టింది. వైద్యులు, పోలీసులతో వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసి భద్రత కల్పించనున్నారు. ఇటీవల డాక్టర్లపై జరుగుతున్న దాడులను దృష్టిలో ఉంచుకుని పోలీసులతో సమన్వయం చేసుకుని మరింత సేవలందించేందుకు ఈ వాట్సాప్‌ గ్రూపులు ఉపయోగపడుతాయని డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు.

whatsapp
whatsapp
author img

By

Published : Apr 5, 2020, 2:24 PM IST

Updated : Apr 5, 2020, 3:14 PM IST

కరోనా బాధితులకు సేవలందిస్తున్న వైద్యులు ఇతర అధికారుల భద్రతకు పోలీసులు మరిన్నీ చర్యలు చేపట్టారు. రాష్ట్రంలోని వైద్యులకు ఆయా పోలీసు స్టేషన్‌ల పరిధిలో వాట్సాప్‌ గ్రూపులు ఏర్పాటు చేసి భద్రత కల్పించనున్నారు. డాక్టర్లపై జరుగుతున్న దాడులను దృష్టిలో ఉంచుకుని పోలీసులతో సమన్వయం చేసుకుని మరింత సేవలందించేందుకు ఈ వాట్సాప్‌ గ్రూపులు ఉపయోగపడుతాయని డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. ఎలాంటి అవసరం ఉన్న ఈ గ్రూపుల్లో సమాచారాన్ని పంచుకుంటే వేగంగా స్పందిస్తామని డీజీపీ పేర్కొన్నారు.

డాక్టర్లు చేస్తున్న కృషికి సలాం చేస్తున్నామన్నారు. ఎవరైతే ఈ వాట్సాప్‌ గ్రూపుల్లో ఉన్నారో ఎటువంటి అవసరం వచ్చినా వేగంగా స్పందించాలని ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్ నగర కమిషనరేట్ పరిధిలో ఉన్న పోలీసులకు వైద్యులతో కలిపి మెడికల్ నోడల్ వాట్సాప్‌ గ్రూప్ ఏర్పాటు చేశారు. నోడల్ అధికారిగా ఇన్‌స్పెక్టర్ ఉంటారు. ఇందులో ఏసీపీ, బస్తీ దవాఖాన డాక్టర్లు ఇతర సిబ్బంది, జీహెచ్‌ఎంసీ అధికారులు ఆశా వర్కర్లు, హెల్త్‌వర్కర్లు ఉంటారని స్పష్టం చేశారు. అన్ని శాఖల సమన్వయంతో వైరస్‌ను ఎదుర్కొంటామని డీజీపీ వివరించారు.

  • The entire Police force across the State hv been directed to ensure safety & security of all Doctors & other HealthCare Professionals involved in dealing vth COVID-19 cases on 24 X 7 basis.
    We salute all those medical professionals who r relentlessly involved in fighting #COVID19 pic.twitter.com/T8Nw3vfEhJ

    — DGP TELANGANA POLICE (@TelanganaDGP) April 5, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ చూడండి: భయపడితే రోగనిరోధక శక్తి తగ్గుతుంది: మానసిక వైద్య నిపుణుడు

Last Updated : Apr 5, 2020, 3:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.