కొవిడ్ తీవ్రత అధికంగా ఉన్న బాధితులు త్వరగా కోలుకునేందుకు ఉపయోగపడే ప్లాస్మాను అందుబాటులోకి తెచ్చేందుకు తెలంగాణ ప్లాస్మా దాతల సంఘం ఏర్పాటైంది. మహమ్మారి నుంచి విముక్తి పొందిన వారితో ఏర్పాటైన సంఘానికి పీసీసీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డి అధ్యక్షుడిగా వ్యవహరించనున్నారు. దాతల సంఘం లోగోను ప్రెస్‌క్లబ్‌లో ఆవిష్కరించారు.
రాజకీయాలకు అతీతంగా ఏర్పడిన.. ఈ స్వచ్ఛంద సంస్థ పూర్తి ఉచితంగా సేవలు అందిస్తుందని నారాయణరెడ్డి తెలిపారు. కొవిడ్ బాధ ఏంటో అనుభవించిన తమకు తెలుసని.. అందుకే సేవలందించేందుకు ముందుకొచ్చినట్లు తెలిపారు. రాష్ట్రప్రభుత్వం తరఫున ఒక అధికారిని అనుసంధానం చేస్తే.. తామే ఐసీఎంఆర్, రాష్ట్ర ప్రభుత్వం నిబంధనలకు లోబడి ప్లాస్మా దాతల వివరాలు సేకరించి ప్రభుత్వానికి అందిస్తామని గూడూరు తెలిపారు.
ఇదీ చూడండి : ఐసోలేషన్‌లో హైదరాబాద్ కలెక్టర్ శ్వేతా మహంతి