ETV Bharat / city

Telangana Top News: 3PM టాప్​న్యూస్

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

3PM TOPNEWS
3PM TOPNEWS
author img

By

Published : Aug 11, 2022, 2:58 PM IST

  • అలా ప్రచారం చేయడానికి వీల్లేదు.. భాజపాకు షాకిచ్చిన ఈసీ

సీఎం కేసీఆర్‌కు వ్యతిరేకంగా భాజపా చేపట్టిన ప్రచారాన్ని నిలిపివేయాలని కేంద్ర ఎన్నికల సంఘం భాజపాను ఆదేశించింది. 'సాలు దొర‌- సెలవు దొర' ప్రచారంపై ఈసీ అభ్యంతరం వ్యక్తం చేసింది. సీఎం బొమ్మతో భాజపా పోస్టర్లు ముద్రించేందుకు అనుమతి నిరాకరిస్తున్నట్లు తెలిపింది.

  • వైఎస్ విజయమ్మకు తప్పిన ప్రమాదం.. హైదరాబాద్​ వస్తుండగా ఘటన

రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తల్లి వైయస్ విజయమ్మకు పెను ప్రమాదం తప్పింది. అనంతపురం నుంచి హైదరాబాద్​కు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

  • మరో 8 లక్షల టన్నుల ఉప్పుడు బియ్యం సేకరణకు కేంద్రం అనుమతి

రాష్ట్రంలో మరో 8 లక్షల టన్నుల ఉప్పుడు బియ్యం సేకరణకు కేంద్రం అనుమతి తెలిపింది. ఈ మేరకు రాష్ట్ర పౌరసరఫరాలశాఖకు సమాచారం పంపిది. 2021-22 యాసంగిలో పండించిన 8 లక్షల టన్నుల బియ్యం సేకరణకు ఆమోదం తెలిపింది. బియ్యాన్ని గతంలోని 6.05 లక్షల టన్నులకు అదనంగా సేకరించాలని నిర్ణయించింది.

  • పాక్​ యువతిని హైదరాబాద్ తీసుకొచ్చేందుకు హైదరాబాదీ సాహసం..

పాకిస్థాన్‌ యువతిని హైదరాబాద్ తీసుకొచ్చేందుకు ప్రయత్నించిన కేసులో బిహార్ పోలీసులు అరెస్ట్ చేసిన మహమూద్ వివరాలను హైదరాబాద్ పోలీసులు సేకరిస్తున్నారు. బిహార్ పోలీసులను సంప్రదించడంతో పాటు.. ఇంటిలిజెన్స్ బ్యూరో అధికారులతోనూ వివరాలు ఆరా తీస్తున్నారు.

  • ప్రకాశం బ్యారేజీకి వరద ఉద్ధృతి

కృష్ణా నదీలో వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. దీంతో.. ఏపీలోని ప్రకాశం బ్యారేజీకి వరద పోటెత్తుతోంది. ఫలితంగా.. అధికారులు గేట్లు ఎత్తి నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. తీర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు.

  • వరదల్లో కొట్టుకుపోయిన ATM- రూ.24లక్షలు గంగార్పణం!

ఉత్తరాఖండ్​లో వరదల కారణంగా భారీ ఆస్తి నష్టం జరిగింది. ఉత్తర కాశీ జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా కుమోలో నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఫలితంగా పురోలాలో నది ఒడ్డున ఉన్న 8 దుకాణాలు నీటిలో కొట్టుకుపోయాయి. వీటిలో ఒకదానిలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఏటీఎం కూడా ఉంది.

  • 14వ ఉపరాష్ట్రపతిగా ప్రమాణం చేసిన ధన్​ఖడ్​

భారత 14వ ఉపరాష్ట్రపతిగా ప్రమాణం చేశారు జగదీప్​ ధన్​ఖడ్​. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము.. ధన్​ఖడ్​తో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, మాజీ రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, లోక్​సభ స్పీకర్​ సహా పలువురు కేంద్ర మంత్రులు హాజరయ్యారు.

  • ఆంగ్లేయుల నయవంచనకు మౌన సాక్ష్యం 'ఇండియా గేట్​'

అమర జవాన్ల జ్యోతుల విలీనంతో ప్రస్తుతం వార్తల్లోకి వచ్చిన దిల్లీలోని ఇండియా గేట్‌కు ఓ అంతర్జాతీయ నేపథ్యముంది. అంతేకాదు ఆంగ్లేయులు మనకు మాటిచ్చి చేసిన మోసానికీ.. అమాయక భారతీయ సిపాయిలకు చేసిన వంచనకు ఇదో మౌన సాక్ష్యం.

  • 'అలా గెలవడం కంటే ఓడిపోవడమే మేలు'.. రిషి కీలక వ్యాఖ్యలు

బ్రిటన్​ ప్రధానమంత్రి పదవి కోసం పోటీ పడుతున్న రిషి సునాక్​ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు చేసే తప్పుడు వాగ్దానాలతో విజయం సాధించడం కంటే ఓడిపోవడం మేలని రిషి అభిప్రాయపడ్డారు.

  • ఖర్చులు తగ్గించుకోవాలా? '30 డేస్ రూల్​' ట్రై చేయండి!

నెల‌కు రూ.50 వేల నుంచి రూ.70 వేలు సంపాదించే వారికి అదనంగా రూ. 1000 - రూ.1500 ఖ‌ర్చు చేయ‌డం పెద్ద‌గా అనిపించ‌దు. కానీ, ఇలాంటి చిన్న చిన్న కొనుగోళ్లు మీకు తెలియ‌కుండానే ఖర్చుల‌ను పెంచేస్తాయి. అటువంటి కొనుగోళ్లను నివారించేందుకు ఒక చ‌క్క‌టి పరిష్కారం 30-రోజుల నియమం.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.