ETV Bharat / city

Telangana Top News: టాప్​న్యూస్ @ 3PM - 3పీఎం టాప్​న్యూస్

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

3PM TOPNEWS
3PM TOPNEWS
author img

By

Published : Aug 10, 2022, 2:59 PM IST

  • బిహార్ సీఎంగా నితీశ్.. ఎనిమిదో సారి ప్రమాణం..

జేడీయూ నేత నితీశ్ కుమార్ బిహార్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఎనిమిదో సారి రాష్ట్ర సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు.

  • యువతిపై కత్తితో దాడి చేసిన ప్రేమోన్మాది అరెస్ట్

నిన్న నల్గొండలో ఫారెస్ట్ పార్క్‌లో అమ్మాయిపై హత్యాయత్నం కేసులో ప్రేమోన్మాది మీసాల రోహిత్​ను అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి వెల్లడించారు. గతంలోనూ నిందితుడు బాధితురాలిని సీసాతో బెదిరించాడని చెప్పారు. ఈ కేసును వ్యక్తిగతంగా తీసుకుని విచారణ చేస్తున్నామన్నారు.

  • 'ఆ మాత్రం రేవంత్‌రెడ్డికి తెల్వదా..'

మునుగోడు ఉపఎన్నికతో రాష్ట్రంలో ఎన్నికలవేడి మొదలైంది. అయితే ఇదిలా ఉండగా పాల్వాయి స్రవంతి ఆడియో కాంగ్రెస్‌లో కలకలం రేపుతోంది. సామాజిక మాధ్యామాల్లో స్రవంతి ఆడియో హల్‌చల్‌ చేస్తోంది.

  • ఎస్సీ వర్గీకరణ, రిజర్వేషన్ల అంశంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీం నోటీసులు

ఎస్సీ వర్గీకరణ, రిజర్వేషన్ల అంశంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీచేసింది.

  • పెరుగుతున్న గోదావరి నీటిమట్టం..

కృష్ణా గోదావరి నదుల్లోకి భారీగా వరద ప్రవాహం వచ్చి చేరుతుంది. దీంతో అధికారులు శ్రీశైలం 10 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. ఎగువ నుంచి ప్రవాహం పెరుగుతుండటాన్ని బట్టి నాగార్జునసాగర్‌ గేట్లు గురువారం తెరుచుకునే అవకాశాలున్నాయి.

  • ఓ కార్మికుడి ఆత్మహత్యాయత్నం.. సెల్ఫీ వీడియో తీసుకుని

ఓ కార్మికుడు మనస్తాపంతో సెల్ఫీ ​వీడియో తీసుకుంటూ ఆత్మహత్యకు యత్నించాడు. హనుమకొండ జిల్లాకు చెందిన సాంబరాజు బండలు కొట్టి జీవనం సాగిస్తున్నాడు. అయితే అతడు బండలు కొట్టేందుకు పేలుడు పదార్ధాలను వినియోగిస్తున్నారని పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు.

  • ఒకేసారి జాతీయ గీతం పాడిన 16వేల మంది

ఒకేసారి 16వేల మంది విద్యార్థులు కలిసి జాతీయ గీతాన్ని ఆలపించి.. స్వాతంత్ర్య సంగ్రామ స్ఫూర్తిని చాటిచెప్పారు. భారత్​కు స్వాతంత్ర్యం వచ్చి 75ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్​లో భాగంగా మంగళవారం ఈ కార్యక్రమం నిర్వహించారు.

  • ఆండ్రాయిడ్, యాపిల్.. ఫోన్ ఏదైనా ఒకటే ఛార్జర్! కేంద్రం కొత్త రూల్స్​!!

'సన్న పిన్​ ఛార్జర్​ ఉందా?'.. 10-15ఏళ్ల క్రితం బాగా వినిపించిన మాట. ఇప్పుడు కూడా పెద్దగా ఏం మారలేదు. ఐఫోన్​ ఛార్జర్​ ఉందా? సీ-పోర్ట్ ఛార్జర్ ఉందా? అంటూ మన ఫోన్​కు సరిపోయే ఛార్జర్ కోసం వెతుక్కోవాల్సిందే. అలా కాకుండా అన్ని ఫోన్స్​కూ ఒకటే ఛార్జర్ పనిచేస్తే? ఈ ప్రశ్నకు జవాబు వెతికే పనిలో ఉంది కేంద్రప్రభుత్వం.

  • రూ.54వేల కోట్ల టెస్లా షేర్లు విక్రయించిన మస్క్.. కారణం అదే!

టెస్లాలో తనకు ఉన్న షేర్లను ఎలాన్ మస్క్ విక్రయించారు. ఏకంగా 79.2 లక్షల షేర్లు విక్రయించినట్లు మార్కెట్ నియంత్రణ సంస్థ వెల్లడించింది.

  • అతడికి నటి పూర్ణ టైట్​ హగ్..​ 'ఎప్పటికీ నా వాడే' అంటూ..

నటి పూర్ణ పెళ్లి ఆగిపోయిందంటూ కొద్ది రోజులుగా ప్రచారం సాగుతోంది. అయితే తాజాగా ఆమె ఈ రూమర్స్​కు చెక్​ పెట్టారు. ​సోషల్​మీడియా వేదికగా ఓ ఫోటో షేర్ చేశారు. ఆ ఫొటోలో ఆమె కాబోయే భర్త్​ షానిద్​ని గట్టిగా కౌగిలించుకుని సిగ్గుపడుతున్నారు. "అతడెప్పటికీ నా వాడే" అంటూ లవ్‌ సింబల్స్‌ను జోడించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.