Telangana National Unity Vajrotsavam: : బానిస సంకెళ్లను విడిచి హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్‌లో కలిసి 75వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న వేళ... నేటి నుంచి రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహిస్తోంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పకడ్బందీగా సాగాయి. సెప్టెంబర్ 17న ఎన్టీఆర్ స్టేడియంలో వజ్రోత్సవాలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.
అందులో భాగంగా నగరంలోని ముఖ్యమైన ప్రభుత్వ కార్యాలయాలను దీపకాంతులతో అందంగా అలంకరించారు. మువ్వన్నెల జెండాల రంగులతో ప్రభుత్వ కార్యాలయాలు విభిన్న రంగులతో మెరిసిపోతున్నాయి. బీ.ఆర్.కే భవన్, అసెంబ్లీ, శాసనమండలి, హైదరాబాద్ పోలీస్ కమీషనరేట్ తదితర కార్యాలయాలు దీప కాంతులతో చూడముచ్చటగా ఉన్నాయి. మరిన్ని ప్రభుత్వ భవనాలు, పార్కులకు కూడా విద్యుత్ దీపాలు ఏర్పాటు చేశారు. నగరవాసులు ఆయా కార్యాలయాల వద్ద ఆగి వాటిని తదేకంగా చూస్తున్నారు. మరికొందరు తమ చరవాణీలతో స్వీయచిత్రాలు తీసుకుంటున్నారు. నగరంలోని చాలా ప్రాంతాలను దీపకాంతులతో అలంకరించడంతో నగరం రాత్రివేళ అద్బుతంగా కనువిందు చేస్తోంది.
ఇవీ చదవండి: