ETV Bharat / city

కోర్టు మాటే మంత్రమైంది.. ఆ జంటలను మళ్లీ ఒక్కటి చేసింది...

author img

By

Published : Dec 13, 2020, 6:41 AM IST

దంపతుల మధ్య ఏర్పడే స్వల్ప వివాదాలు సర్దిచెప్పేవారు లేక పెద్దవవుతున్నాయి. ఎవరికివారు పంతాలకుపోయి కోర్టు మెట్లెక్కుతుండటంతో అవికాస్తా విడాకులకు దారితీస్తున్నాయి. సిటీ సివిల్‌ కోర్టు, సికింద్రాబాద్‌ కోర్టుల్లో విడాకులు, భరణం, పిల్లలపై హక్కులు తదితర దాంపత్య కేసులు సుమారు ఐదు వేలకుపైగా పెండింగ్‌లో ఉన్నాయి. కోర్టుల్లో కేసులు తేలడానికి ఎక్కువకాలం పడుతుండటంతోపాటు కొన్నిసార్లు ఇవి ఘర్షణలు, నేరాలకూ కారణమవుతున్నాయి. ఈ నేపథ్యంలో కొందరు వివాదాన్ని సత్వరం పరిష్కరించుకునే ఉద్దేశంతో లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ (న్యాయసేవాధికార సంస్థ)ని ఆశ్రయిస్తున్నారు.

Telangana Lok adalat compromise three couples
లోక్​ అదాలత్​లో ఒక్కటైన జంటలు

వివాదాల పరిష్కారంలో భాగంగా భార్యభర్తలకు నచ్చజెప్పి వారిని మళ్లీ ఒకటి చేయడానికి న్యాయసేవాధికార సంస్థ ప్రాధాన్యమిస్తోంది. శనివారం జాతీయ లోక్‌ అదాలత్‌లో భాగంగా హైదరాబాద్‌ సిటీ సివిల్‌ కోర్టులోని న్యాయసేవాధికార సంస్థ మూడు జంటలకు మళ్లీ ముడి వేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే తరహాలో దాంపత్య వివాదాల కేసులు 61 పరిష్కారమయినట్టు న్యాయ వర్గాలు తెలిపాయి. ఈ కార్యక్రమంలో సిటీ సివిల్‌ కోర్టు లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ ఛైర్మన్‌ సి.సుమలత, కార్యదర్శి కె.మురళీమోహన్‌, కుటుంబ ప్రధాన న్యాయస్థానం జడ్జి లక్ష్మీశారద, ప్రిసైడింగ్‌ అధికారి జె.జీవన్‌కుమార్‌లు పాల్గొన్నారు. ‘సిటీ సివిల్‌ కోర్టు పరిధిలో నేరుగా, వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా నిర్వహించిన లోక్‌అదాలత్‌లలో 360 కేసులను పరిష్కరించాం. రూ.30.26 లక్షల పరిహారాన్ని లబ్ధిదారులకు అందజేశాం. ఇందులో 310 మోటారు వాహన ప్రమాదాల కేసుల్లో బాధితులకు రూ.21.65 లక్షల పరిహారం అందించాం’ అని సిటీ సివిల్‌ కోర్టు న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి కె.మురళీమోహన్‌ వెల్లడించాయి.

మాట మంత్రమైంది..జంట కలిసింది

ఓ జంట 2015లో పెళ్లితో ఒక్కటైంది. ఓ పాప కూడా జన్మించింది. అనారోగ్యంతో ఉన్న అత్తమామల బాగోగులు చూసుకునే విషయమై ఏర్పడిన చిన్నపాటి గొడవ చినికిచినికి గాలివానగా మారి..దంపతులు విడిపోయేందుకు కారణమైంది. మూడేళ్లుగా వివాదం కొనసాగుతుండగా, తన దాంపత్య హక్కును పునరుద్ధరించాలంటూ భర్త కోర్టును ఆశ్రయించారు. న్యాయసేవాధికార సంస్థ ప్రతినిధులు దంపతులకు కౌన్సెలింగ్‌ చేశారు. విడిపోతే భవిష్యత్తులో తలెత్తే సమస్యలను విడమరిచి చెప్పడంతో భార్య, భర్తతో కలిసి వెళ్లడానికి అంగీకరించారు. విడాకుల కేసునూ ఉపసంహరించుకున్నారు.

మొక్క సాక్షిగా ఒక్కటయ్యారు

వివాహమై పదహారేళ్లు గడిచిన తర్వాత భర్త మద్యానికి బానిసయ్యారు. ఇద్దరు పిల్లల ఎదుటే మద్యం తాగడంతోపాటు తన సంపాదననూ లాక్కొంటూ వేధింపులకు గురిచేస్తుండటంతో భరించలేని భార్య విడాకులు కోరుతూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఇరుపక్షాలతో చర్చించిన న్యాయసేవాధికార సంస్థ పిల్లల భవిష్యత్తునూ దృష్టిలో పెట్టుకోవాలని హితవు పలికింది. ప్రయత్నం ఫలించింది. పొరపాటును సరిదిద్దుకుంటానని, భార్యాపిల్లలను బాగా చూసుకుంటానని భర్త హామీ ఇవ్వడంతో ఆ ఇల్లాలు విడాకుల కేసును ఉపసంహరించుకున్నారు. పిల్లల సమక్షంలో ఆ జంట మళ్లీ దండలు మార్చుకుని ఒక్కటైంది. ఇందుకు నిదర్శనంగా సిటీ సివిల్‌ కోర్టు ఆవరణలో ఆ దంపతులతో మొక్క నాటించగా వారి కుమార్తె నీరు పోసింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.