ETV Bharat / city

బ్రాహ్మణులు, గురువుల పట్ల కేసీఆర్‌కు అపార గౌరవం: కేటీఆర్

బ్రాహ్మణుల సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. పేద బ్రాహ్మణుల కోసం బ్రాహ్మణ పరిషత్ ఏర్పాటు చేశారని తెలిపారు. హైదరాబాద్​లో బ్రాహ్మణ సంఘాలతో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు.

telangana it minister ktr
తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్
author img

By

Published : Mar 7, 2021, 1:52 PM IST

బ్రాహ్మణులు, గురువుల పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్​కు అపార గౌరవం ఉందని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ అన్నారు. ఆలయాల పేర్లను కొత్త జిల్లాలకు పెట్టారని తెలిపారు. హైదరాబాద్​లో బ్రాహ్మణ సంఘాలతో సమావేశమైన మంత్రి కేటీఆర్ వారి సంక్షేమానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని స్పష్టం చేశారు.

తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్

పేద బ్రాహ్మణుల కోసం బ్రాహ్మణ పరిషత్​ ఏర్పాటు చేశామని, అర్చకుల సమస్యలను పరిష్కరిస్తున్నామని కేటీఆర్ వెల్లడించారు. భాజపా అభ్యర్థి రాంచందర్ రావుకు అవకాశం ఇచ్చినా ఏమీ చేయలేదని తెరాస అభ్యర్థి వాణిదేవికి ఓటు వేసి గెలిపించాలని కోరారు. వాణీదేవి లక్షమంది పట్టభద్రులను తయారు చేశారన్న కేటీఆర్.. ఆమె గెలుపు ఖరారైందని ధీమా వ్యక్తం చేశారు.

ఐటీఐఆర్ ఇవ్వకుండా రాష్ట్ర యువత నోట్లో కేంద్రం మట్టికొట్టిందని మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజురోజుకూ పెట్రో, గ్యాస్ ధరలు పెంచుతూ సామాన్యుడిపై భారం పెడుతోందని అన్నారు. కేంద్రం అన్ని విధాలుగా రాష్ట్రంపై శీతకన్ను వేసిందన్న మంత్రి.. బ్రాహ్మణుల సమస్యలపై త్వరలోనే సమావేశం నిర్వహిస్తామని చెప్పారు.

  • ఇదీ చూడండి : ప్రజలు, ప్రభుత్వానికి వారధిగా ఉన్నా: పల్లా రాజేశ్వర్​రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.