ETV Bharat / city

KTR About Genome Valley : 'ఫార్మా కంపెనీల గమ్యస్థానంగా జీనోమ్ వ్యాలీ' - జాంప్ ఫార్మాను ప్రారంభించిన కేటీఆర్

KTR About Genome Valley : ఫార్మా కంపెనీల విస్తరణకు హైదరాబాద్‌లో అనువైన అవకాశాలున్నాయని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పునరుద్ఘాటించారు. ప్రపంచంలోనే అతిపెద్దదైన బి-హబ్ నిర్మాణాన్ని తెలంగాణ సర్కార్ తలపెట్టిందని తెలిపారు. హైదరాబాద్ జీనోమ్ వ్యాలీలో జాంప్ ఫార్మా కంపెనీని ప్రారంభించారు.

KTR About Genome Valley
KTR About Genome Valley
author img

By

Published : Apr 5, 2022, 11:54 AM IST

Updated : Apr 5, 2022, 12:23 PM IST

ఫార్మా కంపెనీల గమ్యస్థానంగా జీనోమ్ వ్యాలీ

KTR About Genome Valley : లైఫ్ సైన్సెస్ రంగం అభివృద్ధికి హైదరాబాద్‌లో విస్తృత అవకాశాలున్నాయని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ పునరుద్ఘాటించారు. ఫార్మా రంగ కంపెనీలకు జీనోమ్ వ్యాలీ గమ్యస్థానంగా మారిందని తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్దదైన బి-హబ్ నిర్మాణాన్ని రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిందని చెప్పారు. బి-హబ్ నిర్మాణంతో పాటు జీనోమ్ వ్యాలీ అభివృద్ధి కొనసాగుతుందని వెల్లడించారు. త్వరలో బి-హబ్‌ ప్రారంభించి.. బయోలాజికల్‌ పరిశోధనలకు తోడ్పాటు అందించబోతున్నామని మంత్రి ప్రకటించారు. జీనోమ్‌వ్యాలీని మరింత విస్తృతపరిచేలా.... మరో 400ఎకరాలు సేకరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని వివరించారు.

KTR At Genome Valley : హైదరాబాద్ జీనోమ్ వ్యాలీలో మంత్రి కేటీఆర్.. జాంప్ ఫార్మాను ప్రారంభించారు. కెనడా తర్వాత హైదరాబాద్‌లో ఈ కంపెనీ పెద్ద శాఖను ప్రారంభించిందని కేటీఆర్ తెలిపారు. అహ్మదాబాద్‌ను పరిశీలించిన తర్వాత ఈ కంపెనీ ఏర్పాటుకు హైదరాబాద్‌ను ఎంచుకున్నారని వెల్లడించారు. భాగ్యనగరాన్ని ఎంచుకున్నందుకు జాంప్ ఫార్మా కంపెనీ ప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు. అన్నిరకాలుగా ఫార్మా సంస్థలకు అణువుగా ఉన్న జీనోమ్‌ వ్యాలీలో... యూనిట్ల స్థాపనకు ఫార్మా కంపెనీలు ముందుకు రావాలని కేటీఆర్‌ పిలుపునిచ్చారు.

"రాష్ట్రంలో లైఫ్‌సైన్సెస్‌ రంగాన్ని 2030 కల్లా 100బిలియన్‌ డాలర్ల స్థాయికి తీసుకెళ్లడమే మా లక్ష్యం. రానున్న 8 ఏళ్లలో ఈ రంగంలో 4వేలకు పైగా మందికి ఉపాధి కల్పించడమే మా ధ్యేయం. హైదరాబాద్ సాధించిన ఘనత గురించి నేను అమెరికా పర్యటనలో మాట్లాడుతున్నప్పుడు వాళ్లంతా ఆశ్చర్యానికి గురయ్యారు. జీనోమ్ వ్యాలీలో అత్యంత ప్రతిష్ఠాత్మక మౌలిక వసతులు, ఆధునిక సౌకర్యాలున్నాయి. రాష్ట్రం ఎంత కార్యశీలతను కనబర్చినా కేంద్రం నుంచి సహకారం మాత్రం అందడం లేదు."

- కేటీఆర్, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి

జీనోమ్‌ వ్యాలీలో అన్ని రకాల మౌలిక వసతులను మెరుగుపరుస్తున్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఇక్కడికి ప్రయాణాలు సులువయ్యేలా ఫ్లైఓవర్లు, స్కైవేలు నిర్మిద్దామని ప్రయత్నిస్తున్నా కేంద్రం నుంచి సహకారం అందడం లేదని ఆరోపించారు. ఎనిమిదేళ్లుగా ప్రయత్నిస్తున్నా భూములు ఇవ్వకుండా అడ్డుపడుతున్నారని మండిపడ్డారు.

Last Updated : Apr 5, 2022, 12:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.