Intermediate Practical Exams : రాష్ట్రంలో ఈ నెల 23 నుంచి ఏప్రిల్ 9 వరకు జరిగే ఇంటర్మీడియట్ ప్రయోగ పరీక్షలకు 15 నిమిషాల వరకు ఆలస్యమైనా విద్యార్థులను అనుమతించవచ్చని, ఆ తర్వాత లోపలికి రానివ్వొద్దని ఇంటర్‌బోర్డు కళాశాలల యాజమాన్యాలను ఆదేశించింది. ఈ మేరకు బోర్డు కార్యదర్శి జలీల్ ఆదేశాలు జారీ చేశారు.
నేటి నుంచే ఆన్‌లైన్‌లో హాల్‌టికెట్లు..
విద్యార్థులు చదివే కళాశాలల్లో రోజూ ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ప్రయోగ పరీక్షలు జరుపుతారు. ఒక కళాశాలలోని విద్యార్థుల్లో 25 శాతం మంది కంటే 30కి 30 మార్కులు వచ్చిన వారి, 27-30 మార్కులు వచ్చిన వారి జవాబుపత్రాలను కూడా తాము మరోసారి పునఃపరిశీలన చేస్తామని స్పష్టం చేశారు. ఎగ్జామినర్లుగా నియమితులైన అధ్యాపకులను విధుల నుంచి రిలీవ్ చేయకుంటే ఆ కళాశాలల ప్రిన్సిపాళ్లు/యాజమాన్యాలకు రూ.5 వేల జరిమానా విధిస్తామని హెచ్చరించారు. ‘‘విద్యార్థులకు ఎగ్జామినర్లు వేసిన మార్కులను అదేరోజు రాత్రి 8 గంటలలోపు ఆన్‌లైన్‌లో బోర్డుకు పంపాలి. జాగ్రఫీ విద్యార్థులకు ఈనెల 31 నుంచి ఏప్రిల్ 9 వరకు ప్రయోగ పరీక్షలు జరుగుతాయి. ఆదివారం నుంచి ఆన్‌లైన్‌లో ప్రాక్టికల్ పరీక్షల హాల్‌టికెట్లు అందుబాటులో ఉంటాయి’’ అని ఇంటర్‌బోర్డు పేర్కొంది.
ఇదీ చదవండి:Intermediate Exams Schedule 2022 : మే 6 నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు