నూతన ఆవిష్కరణలు సాధించిన విద్యా సంస్థలకు కేంద్ర ప్రభుత్వం అటల్ ర్యాంకులు ప్రకటించింది. రెండు విభాగాల్లో రాష్ట్రానికి చెందిన 3 విద్యా సంస్థలు మొదటి పది ర్యాంకుల్లో నిలిచాయి. ప్రైవేట్ కళాశాలల కేటగిరిలో ఎస్సార్ ఇంజినీరింగ్ కాలేజీ మొదటి స్థానంలో నిలవగా... సీఎంఆర్ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ ఆరో ర్యాంకు సాధించింది.
జాతీయ, కేంద్రీయ విశ్వవిద్యాలయాల విభాగంలో హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం పదో స్థానంలో నిలిచింది. కేంద్ర ప్రభుత్వం మొత్తం ఆరు కేటగిరీల్లో ర్యాంకులను ప్రకటించింది. ఇవాళ దిల్లీలో ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ర్యాంకులను విడుదల చేశారు.




