చట్టాన్ని సపరించాలని ప్రభుత్వాలను ఆదేశించే అధికారం కోర్టులకు లేదని హైకోర్టు తేల్చి చెప్పింది. చట్టాల రూపకల్పన ప్రభుత్వ విధాన నిర్ణయమని... వివిధ పరిస్థితులు, అవసరాలకు అనుగుణంగా చట్టాలను రూపొందించడం శాసన వ్యవస్థకు సంబంధించిన అంశమని.... ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. శాసన వ్యవస్థ విధాన నిర్ణయాల్లో కోర్టులు అంత తేలికగా జోక్యం చేసుకోలేవని పేర్కొంది.
ఐపీసీలోని సెక్షన్ 376 , 376 ఏ లు రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించాలని కోరుతూ హీ.నవ ప్రవల్లికగౌడ్ అనే యువతి దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై..... ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ ఎస్ చౌహాన్, జస్టిస్ బ. విజయ్‌సేన్‌రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టి తీర్పు వెల్లడించింది. చట్ట సవరణల కోసం కేంద్ర న్యాయశాఖామంత్రికి వినతిపత్రం సమర్పించుకోవచ్చని పేర్కొంది. అత్యాచారానికి గురైన 18 ఏళ్లలోపు మహిళ మృతి చెందితే.. నిందితుడికి మరణశిక్ష ఉండదన్న వాదన సరికాదని హైకోర్టు అభిప్రాయపడింది.