కరోనా చికిత్సలు చేస్తున్న వైద్య సిబ్బంది భద్రతపై హైకోర్టు విచారణ జరిపింది. కొవిడ్-19 ఆసుపత్రుల వద్ద భద్రత పెంచినట్లు రాష్ట్ర సర్కార్ హైకోర్టుకు నివేదించింది. వైద్య సిబ్బందిపై దాడులకు సంబంధించి 4 కేసులు నమోదైనట్లు తెలిపింది.
ఆసుపత్రుల వద్ద ఎంతమంది పోలీసులు ఉంటున్నారో తెలపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. వైద్య సిబ్బందిపై దాడుల ఘటనలు ఎన్ని జరిగాయని ప్రశ్నించింది. రెండు వారాల్లో మరింత సమగ్ర నివేదిక ఇవ్వాలని తెలిపింది.