ETV Bharat / city

Telangana HC on BJP MLAs Suspension : భాజపా ఎమ్మెల్యేల సస్పెన్షన్‌పై అసెంబ్లీ కార్యదర్శికి హైకోర్టు నోటీసులు

Telangana HC on BJP MLAs Suspension : శాసనసభ సమావేశాల నుంచి భాజపా ఎమ్మెల్యేల సస్పెన్షన్​పై హైకోర్టులో విచారణ జరిగింది. సభ నియమావళికి విరుద్ధంగా సస్పెండ్ చేశారని భాజపా ఎమ్మెల్యేలు వాదించగా.. అసెంబ్లీ వ్యవహారాల్లో కోర్టులు జోక్యం చేసుకోవద్దని ఏజీ అన్నారు.

Telangana HC on BJP MLAs Suspension
Telangana HC on BJP MLAs Suspension
author img

By

Published : Mar 9, 2022, 1:08 PM IST

Updated : Mar 9, 2022, 10:38 PM IST

Telangana HC on BJP MLAs Suspension : భాజపా ఎమ్మెల్యేల సస్పెన్షన్​పై అసెంబ్లీ కార్యదర్శికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. రఘునందన్​రావు, ఈటల రాజేందర్, రాజాసింగ్ పిటిషన్​పై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది. రాజ్యాంగ విరుద్ధంగా ముందస్తు ప్రణాళికతోనే సస్పెండ్ చేశారని భాజపా ఎమ్మెల్యేల తరఫున సీనియర్ న్యాయవాది ప్రకాష్ రెడ్డి వాదించారు. భాజపా ఎమ్మెల్యేల పేర్లను ప్రస్తావించకుండానే సస్పెన్షన్ తీర్మానం ప్రవేశపెట్టారన్నారు. సస్పెన్షన్ ఉత్తర్వులను ఇవ్వడం లేదని వాదించారు. సస్పెన్షన్ ప్రొసీడింగ్స్ సమర్పించేలా ఆదేశాలు ఇవ్వాలని న్యాయస్థానాన్ని కోరారు.

అసెంబ్లీ కార్యదర్శి వాదన వినకుండా ఆదేశాలు ఇవ్వొద్దని.. చట్టసభల వ్యవహారాల్లో కోర్టులు జోక్యం చేసుకోవద్దని ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ బీఎస్​ ప్రసాద్​ కోరారు. దీనిపై స్పందించిన కోర్టు రేపటిలోగా వివరాలు సమర్పించాలని అసెంబ్లీ కార్యదర్శిని కోర్టు ఆదేశించింది. విచారణను రేపటికి వాయిదా వేసింది.

ఏం జరిగిందంటే..

ఈనెల 7న శాసన సభలో మంత్రి హరీశ్​రావు బడ్జెట్​ ప్రవేశపెడుతుండగా.. భాజపా సభ్యులు ఈటల రాజేందర్​, రఘునందర్​రావు, రాజాసింగ్.. అడ్డుతగులుతున్నారంటూ వారిని సభ నుంచి సస్పెండ్​ చేశారు. భాజపా ఎమ్మెల్యేలను సస్పెండ్​ చేయాలంటూ.. మంత్రి తలసాని శ్రీనివాస్​యాదవ్​ తీర్మానం ప్రవేశపెట్టగా.. సభ ఆమోదించింది. దీనిపై స్పీకర్​ పోచారం శ్రీనివాసరెడ్డి ప్రకటన చేశారు. ఈ సెషన్​ పూర్తయ్యే వరకు భాజపా సభ్యులను సస్పెండ్​ చేస్తున్నట్లు వెల్లడించగా.. ఆ ముగ్గురు నేతలు అసెంబ్లీ బయట ఆందోళనకు దిగారు.

సుప్రీం కోర్టు తప్పు పట్టినా..

తమ సస్పెన్షన్​పై భాజపా ఎమ్మెల్యేలు రాజాసింగ్, ఈటల, రఘునందన్ రావు.. మరికొందరు కాషాయ నేతలతో కలిసి గవర్నర్​​కు వినతి పత్రం అందజేశారు. ప్రణాళికా ప్రకారమే తమను సభ నుంచి సస్పెండ్ చేసిందని ఆరోపించారు. అసెంబ్లీలో ప్రజల తరఫున తమ గళం వినిపించకుండా చేసేందుకే ఈ కుట్ర అని మండిపడ్డారు. 'మహారాష్ట్రలో 12 మంది ఎమ్మెల్యేల సస్పెన్షన్‌ను సుప్రీం కోర్టు తప్పుపట్టిన విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోలేదు’ అని భాజపా నేతలు గవర్నర్‌కు తెలిపారు.

Last Updated : Mar 9, 2022, 10:38 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.