రేపటి వీర హనుమాన్ విజయయాత్రకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. వీహెచ్‌పీ, భజరంగ్‌దళ్ తలపెట్టిన శోభాయాత్రకు షరతులతో కూడిన అనుమతిని మంజూరుచేసింది. ఉదయం 9.30 నుంచి మధ్నాహ్నం 1.30 మధ్య యాత్ర పూర్తిచేయాలని సూచించింది. హైదరాబాద్‌లోని గౌలిగూడ నుంచి తాడ్‌బండ్ వరకు శోభాయాత్రకు అనుమతి లభించింది.
శోభాయాత్రలో 21 మందికి మించి పాల్గొనవద్దని స్పష్టం చేసింది. శోభాయాత్రలో ఒక ద్విచక్రవాహనంపై ఒక్కరే ప్రయాణించాలని సూచించింది. శోభాయాత్రను వీడియో చిత్రీకరించి నివేదిక సమర్పించాలని పోలీసులకు ఆదేశాలు జారీచేసింది. కొవిడ్ నిబంధనలు పాటించాలని వీహెచ్‌పీ, భజరంగ్‌దళ్‌కు ధర్మాసనం స్పష్టం చేసింది.
ఇవీచూడండి: కొవిడ్ నిబంధనలతో బైక్ ర్యాలీ నిర్వహిస్తాం: భజరంగ్ దళ్