ఏపీలోని నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష పరిశోధనా కేంద్రం (Satish Dhawan Space Research Center)లో జరుగుతున్న ప్రపంచ అంతరిక్ష వారోత్సవాల్లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ (Governor tamilisai soundararajan) పాల్గొన్నారు. షార్లో జరుగుతున్న ప్రపంచ అంతరిక్ష వారోత్సవాల్లో ఉరఫ్ ఆడిటోరియంలో శాస్త్రవేత్తలు, ఉద్యోగులు, విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.
అంతకు ముందు చెన్నై నుంచి సూళ్లూరుపేట శ్రీ చెంగాళమ్మ ఆలయాన్ని గవర్నర్ తమిళిసై సందర్శించారు. ఆలయ అధికారులు గవర్నర్ తమిళిసైకు స్వాగతం పలికి... ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఇదీచూడండి: MAA Elections: 'మాపై ఆరోపణలు హాస్యాస్పదం'