ETV Bharat / city

ప్రైవేట్​ ఆస్పత్రుల పర్యవేక్షణకు.. ప్రత్యేక టాస్క్​ఫోర్స్​!

ప్రైవేట్​ ఆస్పత్రులు కరోనా బాధితులను దోచుకుంటున్నాయని వస్తున్న వార్తలపై ప్రభుత్వం స్పందించింది. ప్రైవేట్​ ఆస్పత్రుల్లో కొవిడ్​ బాధితుల నుంచి లక్షల రూపాయలు వసూలు చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్న వ్యవహారాలను పరిశీలించేందుకు.. ప్రైవేట్​ ఆస్పత్రుల్లో పాజిటివ్ సోకిన రోగులకు అందించే చికిత్సను పర్యవేక్షించేందుకు ప్రభుత్వం ప్రత్యేక టాస్క్​ఫోర్స్​ ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు.. రాష్ట్ర ప్రభుత్వం టాస్క్​ఫోర్స్​ను నియమిస్తున్నట్టు ఆదేశాలు జారీ చేసింది.

Telangana Government Set up Special Task force For Inspects private hospitals
ప్రైవేట్​ ఆస్పత్రుల పర్యవేక్షణకు.. ప్రత్యేక టాస్క్​ఫోర్స్​!
author img

By

Published : Sep 10, 2020, 8:13 AM IST

ప్రైవేట్​ ఆస్పత్రుల్లో కరోనా బాధితుల ఇబ్బందులను గట్టెక్కించేందుకు ప్రభుత్వం నడుం కట్టింది. కరోనా బాధితుల నుంచి ప్రైవేట్​, కార్పోరేట్​ ఆస్పత్రులు అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నాయంటూ వచ్చిన వార్తలపై స్పందించిన సీఎం కేసీఆర్.. ప్రైవేట్ ఆస్పత్రుల చేష్టలను పర్యవేక్షించేందుకు ప్రత్యేక టాస్క్​ఫోర్స్​ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ముగ్గురు ఐఏఎస్ అధికారులతో ప్రత్యేక టాస్క్​ఫోర్స్​ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. విపత్తు నిర్వహణశాఖ కార్యదర్శి రాహుల్​ బొజ్జా, ఎక్సైజ్​ శాఖ సంచాలకులు సర్ఫరాజ్​ అహ్మద్​, మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి దివ్య ఈ ఫోర్స్​లో సభ్యులుగా ఉన్నారు. ప్రైవేట్​ ఆస్పత్రులు కొవిడ్​ రోగులకు అందిస్తున్న చికిత్స, సంబంధిత అంశాలను టాస్క్​ఫోర్స్​ పర్యవేక్షిస్తుంది. ప్రభుత్వ నిర్దేశిత ధరలకు అనుగుణంగా చికిత్స అందిస్తున్నారా లేదా అన్న అంశంతో పాటు.. కొవిడ్​ చికిత్సలో భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నారా వంటి అంశాలను టాస్క్​ఫోర్స్​ పరిశీలించనుంది. ఎప్పటికప్పుడు ప్రైవేట్ ఆస్పత్రుల తీరుపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నివేదిక ఇవ్వాలని టాస్క్​ఫోర్స్​ను ప్రభుత్వం ఆదేశించింది. టాస్క్​ఫోర్స్​కు అవసరమైన సాంకేతిక సహకారాన్ని వైద్య, ఆరోగ్యశాఖ అందించనుంది.

ఇదీ చదవండి: కేంద్రమంత్రులు తెలంగాణకు వచ్చి కథలు చెబుతున్నారు : కేసీఆర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.