ETV Bharat / city

ప్రవేశ పరీక్షలు వాయిదా.. డిగ్రీ, పీజీపై వారంలో స్పష్టత

ఎంసెట్ సహా ప్రవేశ పరీక్షలన్నీ మరోసారి వాయిదా పడ్డాయి. ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ ప్రజాప్రయోజన వ్యాజ్యంపై విచారణ చేపట్టిన హైకోర్టు ప్రభుత్వాన్ని వివరణ కోరింది. ప్రవేశ పరీక్షలు సహా, టైప్ రైటింగ్ పరీక్షలు కూడా వాయిదా వేస్తున్నట్లు ధర్మాసనానికి ఏజీ నివేదించారు. డిగ్రీ, పీజీ పరీక్షలపై జూలై 9లోగా స్పష్టత ఇవ్వాలని ఓయూ, జేఎన్​టీయూహెచ్, ఉన్నత విద్యామండలిని హైకోర్టు ఆదేశించింది.

ENTRANCE EXAMS
ప్రవేశ పరీక్షలు వాయిదా.. డిగ్రీ, పీజీపై వారంలో స్పష్టత
author img

By

Published : Jun 30, 2020, 7:27 PM IST

ఎంసెట్ సహా ప్రవేశ పరీక్షలన్నీ మరోసారి వాయిదా పడ్డాయి. బుధవారం నుంచి జరగాల్సిన ఎంట్రన్స్​లను ప్రభుత్వం వాయిదా వేసింది. జులైలో జరగనున్న టైప్ రైటింగ్ పరీక్షలు కూడా వాయిదా వేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది. డిగ్రీ, పీజీ పరీక్షలపై జూలై 9లోగా స్పష్టత ఇవ్వాలని ఓయూ, జేఎన్​టీయూహెచ్, ఉన్నత విద్యా మండలిని హైకోర్టు ఆదేశించింది.

ఎంసెట్, ఐసెట్, పాలిసెట్, ఈసెట్, పీజీ ఈసెట్, లాసెట్, పీజీ లాసెట్, ఎడ్​సెట్, పీఈసెట్ వాయిదా వేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బుధవారం పాలిసెట్, పీజీ సెట్ పరీక్షలకు అధికారులు ఇప్పటికే అన్నిఏర్పాట్లు పూర్తి చేశారు. జూలై 6 నుంచి 9 వరకు ఎంసెట్ నిర్వహణకు కూడా సిద్ధమయ్యారు.

లాక్​డౌన్ మళ్లీ విధిస్తారా..?

రాష్ట్రంలో.. ముఖ్యంగా హైదరాబాద్​లో కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్నందున ప్రవేశ పరీక్షలను వాయిదా వేయాలని కోరుతూ ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ విజయసేన్​రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది. హైదరాబాద్​లో మళ్లీ లాక్​డౌన్ విధించే ఆలోచన ఉందా.. ఒకవేళ విధిస్తే ప్రవేశ పరీక్షలు నిర్వహించడం ఎలా సాధ్యమవుతుందని విచారణ సందర్భంగా హైకోర్టు ప్రశ్నించింది. లాక్​డౌన్ కొనసాగించాలా వద్దా.. అనే విషయం కేబినెట్ నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని ఏజీ తెలిపారు. ఒకటి రెండు రోజుల్లో మంత్రి మండలి సమావేశం కానుందని ఏజీ బీఎస్ ప్రసాద్ హైకోర్టుకు నివేదించారు. మధ్యాహ్నం వరకు గడువిస్తే ప్రవేశ పరీక్షలపై నిర్ణయం తీసుకొని చెబుతామని ఈ ఉదయం హైకోర్టుకు ఏజీ తెలిపారు.

ప్రవేశ పరీక్షలన్నీ వాయిదా ..

ప్రవేశ పరీక్షలన్నీ వాయిదా వేస్తున్నట్లు హైకోర్టుకు ఏజీ నివేదించారు. ఈనెల 4, 11, 12 తేదీల్లో జరగాల్సిన టైప్ రైటింగ్ పరీక్షలు కూడా వాయిదా వేస్తున్నట్లు పేర్కొన్నారు. డిగ్రీ, పీజీ పరీక్షలు కూడా రద్దు చేయాలని పిటిషనర్ తరఫు న్యాయవాది దామోదర్ రెడ్డి హైకోర్టును కోరారు. ఇంజినీరింగ్ చివరి సెమిస్టర్ పరీక్షలు నిర్వహించే ఆలోచన లేదని జేఎన్​టీయూహెచ్​ హైకోర్టుకు తెలిపింది. ఏడు, ఎనిమిది సెమిస్టర్ మార్కుల సరాసరితో గ్రేడింగ్​ను ఖరారుచేయాలని ఉన్నత విద్యామండలికి సిఫార్సు చేసినట్లు పేర్కొంది. పరీక్షలపై తుది నిర్ణయం ఉన్నత విద్యామండలి తీసుకోవాల్సి ఉంటుందని వివరించింది.

ఈనెల 9 లోగా స్పష్టత ఇవ్వండి..

డిగ్రీ, పీజీ పరీక్షలపై యూనివర్సిటీ వర్గాలను సంప్రదించి వివరాలు సమర్పిస్తామని ఓయూ తరఫు న్యాయవాది పేర్కొన్నారు. వాదనలు విన్న ధర్మాసనం డిగ్రీ, పీజీ పరీక్షలపై ఈనెల 9 లోగా స్పష్టత ఇవ్వాలని ఓయూ, జేఎన్​టీయూహెచ్, ఉన్నత విద్యామండలిని ఆదేశించింది.

ఇవీచూడండి: రాష్ట్రంలో ప్రవేశ పరీక్షలు వాయిదా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.