ETV Bharat / city

వైన్స్​ కేటాయింపులపై సర్కార్​ మార్గదర్శకాలు.. కలెక్టర్​ నేతృత్వంలో కమిటీలు.. - RESERVATIONS IN LIQUOR STORE ALLOCATIONS

telangana Government new guidelines on wine allocations

author img

By

Published : Nov 7, 2021, 6:27 PM IST

17:43 November 07

మద్యం దుకాణాల కేటాయింపులో రిజర్వేషన్లపై మార్గదర్శకాలు

మద్యం దుకాణాల కేటాయింపులో రిజర్వేషన్లపై ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. ఎస్సీ, ఎస్టీ, గౌడ్‌లకు ప్రభుత్వం నిర్ణయించిన రిజర్వేషన్ల ప్రకారం దుకాణాలు కేటాయించేందుకు సంబంధించిన మార్గదర్శకాలను ప్రకటించింది. కొత్త జిల్లాలను యూనిట్‌గా తీసుకొని కేటాయింపులు చేసేందుకు కలెక్టర్లకు అధికారం ఇచ్చింది. ఆయా జిల్లాల్లో ఉన్న దుకాణాలు ఆధారంగా ఈ కేటాయింపులు పూర్తి చేస్తారు.

కేటాయింపుల కోసం కమిటీ..

ఈ కేటాయింపుల కోసం కలెక్టర్‌ నేతృత్వంలో నలుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో సభ్యులుగా.. జిల్లా ఎక్సైజ్‌ అధికారి, గిరిజన అభివృద్ధి అధికారి, బీసీ సంక్షేమ అధికారి, ఎస్సీ అభివృద్ధి అధికారి ఉంటారు. డ్రా ద్వారా మద్యం దుకాణాల కేటాయింపు జరగనుంది. ఈ కేటాయింపు ప్రక్రియ మొత్తాన్ని వీడియో చిత్రీకరణ చేయటం తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

పాత స్లాబుల ప్రకారమే..

నూతన పాలసీ ప్రకారం మద్యం దుకాణాల కేటాయింపుల్లో రిజర్వేషన్లను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. గౌడ్​లకు 15, ఎస్సీలకు 10, ఎస్టీలకు 5 శాతం దుకాణాలు కేటాయిస్తున్నట్లు స్పష్టం చేసింది. జిల్లాల్లో జనాభా ప్రాతిపదికన లాటరీ ద్వారా దుకాణాల కేటాయింపులు చేయనున్నట్లు తెలిపింది. దరఖాస్తు రుసుము గతంలో మాదిరిగానే రూ.2 లక్షలుగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దుకాణాల కేటాయింపుల్లో పాత స్లాబులే కొనసాగిస్తున్నట్లు సర్కారు ఇప్పటికే స్పష్టం చేసింది. లైసెన్స్‌లు పొందిన వారు ఏడాదికి ఒకసారి నిర్దేశించిన లైసెన్స్‌ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

లైసెన్స్​ ఫీజులు ఇలా..

5 వేల జనాభా వరకు 50 లక్షలు, 5 వేల నుంచి 50 వేల వరకు జనాభా ఉంటే రూ.55 లక్షలు, 50 వేల నుంచి లక్ష వరకు జనాభా ఉంటే 60 లక్షలు లైసెన్స్‌ ఫీజు కట్టాల్సి ఉంటుంది. లక్ష నుంచి 5 లక్షల వరకు జనాభా ఉంటే 65 లక్షలు, 5 లక్షల నుంచి 20 లక్షలు వరకు జనాభా ఉంటే రూ.85 లక్షలు, 20 లక్షలకు మించి జనాభా ఉన్న ప్రాంతాల్లో లైసెన్స్‌ ఫీజు కోటి పది లక్షలుగా నిర్ణయించారు.

ఇదీ చూడండి:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.