రాష్ట్ర అన్నదాతల రైతుబంధు సమూహిక జీవిత బీమా పథకం అప్లికేషన్లలో మార్పుల కోసం ప్రభుత్వం ఓ అవకాశం కల్పించింది. ఈ ఆర్థిక సంవత్సరం రైతుబీమా పథకం అమలులో భాగంగా ప్రభుత్వం రైతుల పేరిట భారతీయ బీమా సంస్థకు ప్రిమీయం చెల్లింపులు చేస్తున్న తరుణంలో... ఏ ఒక్కరికీ అన్యాయం జరగకుండా ఉండేందుకు సరిదిద్దే ప్రయత్నం చేస్తోంది. గతంలో రైతుబీమా సదుపాయం కలిగి ఉన్న రైతులు తమ వివరాలు ఏమైనా తప్పుగా ఉన్నట్లైతే సరిచేసుకునేందుకు అవకాశం కల్పించింది. గ్రామీణ ప్రాంతాల్లో ఏ కారణం చేతనైనా సరే నామిని మరణిస్తే ఆ స్థానంలో పేరు మార్పు, రైతుతో నామిని సంబంధం ఏదైనా తప్పుగా పడి ఉంటే కూడా మార్చుకోవచ్చు.
రైతు పట్టాదారు పాసుపుస్తకంలో రైతు పేరు లేదా తండ్రి పేరు ఆధార్ కార్డులో ఉన్నట్లు లేనిపక్షంలో... మరే కారణం చేతనైనా ఆధార్‌లో పేరు మార్పు, అక్షర దోషాలు దొర్లినట్లైతే అవి కూడా సరిచేసుకోవచ్చు. రైతు కుటుంబంలో భూయజమానైన యువతి పెళ్లైన తర్వాత ఆధార్ కార్డులో ఇంటి పేరు మార్చుకున్నా కూడా అవి సరిచేసుకోవచ్చు. అన్నింటికీ ఆధార్ కార్డు ప్రామాణికం కాబట్టి.. సర్కాలు ఈ అవకాశం కల్పించింది. రైతు పేరు, తండ్రి పేరు, ఇంటి పేరు, పుట్టిన తేదీ, పట్టాదారు పాసు పుస్తకం నెంబర్, మొబైల్ నెంబరు, గ్రామం, మండలం, జిల్లా వంటి అన్ని వివరాలను తప్పనిసరి నమోదు చేయాల్సి ఉండటం వల్ల ఏ ఒక్క పొరపాటు ఉన్న సరిచేసుకోవచ్చు.
బీమాలో మార్పులు, చేర్పుల కోసం సంబంధిత క్లష్టర్ల వారీగా మండల వ్యవసాయ విస్తరణ అధికారి సంప్రదించి వివరాలు ఇవ్వాలని వ్యవసాయ శాఖ సూచించింది. సంబంధిత దరఖాస్తు పూర్తి అన్ని దస్త్రాలు జత చేసి సాఫ్ట్‌వేర్‌లో సరిచేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ నెల 20న బుధవారం చివరి తేదీ కావడంతో ఈ అవకాశం రైతులు సద్వినియోగం చేసుకోవాలని వ్యవసాయ శాఖ వర్గాలు పేర్కొన్నాయి.
ఇవీ చూడండి: