ETV Bharat / city

GST compensation : ప్రత్యామ్నాయ రాబడులపై తెలంగాణ వాణిజ్య శాఖ ఫోకస్ - రెండు నెలల్లో జీఎస్టీ పరిహారం

GST compensation : జీఎస్టీ పరిహారానికి మరో రెండు నెెలల్లో ముగింపు పలకనుండడంతో ప్రత్యామ్నాయ రాబడులపై తెలంగాణ సర్కార్ దృష్టి సారించింది. రాబడిని పెంచుకోవడానికి ఉన్న అన్ని అవకాశాలను పరిశీలిస్తోంది. పన్ను ఎగవేతదారులు, తక్కువ పన్ను చెల్లిస్తున్నవారు...ప్రజల నుంచి జీఎస్టీ వసూలు చేసి ప్రభుత్వానికి చెల్లించని వ్యాపారులను గుర్తించి వసూలు చేయాలని నిర్ణయించింది.

GST compensation
GST compensation
author img

By

Published : Apr 20, 2022, 12:34 PM IST

ప్రత్యామ్నాయ రాబడులపై తెలంగాణ వాణిజ్య శాఖ ఫోకస్

GST compensation : దేశవ్యాప్తంగా జీఎస్టీ పరిహారానికి మరో రెండునెలల్లో కేంద్రం ముగింపు పలకనుండడంతో.. alternative returns రాష్ట్రప్రభుత్వం దృష్టిసారించింది. ఏడాదికి 6వేల కోట్లకుపైగా నష్టం వాటిల్లుతుందని అంచనా వేసిన అధికారులు.. ఆ మేరకు అదనపు రాబడిని పెంచుకోవడానికి ఉన్న అవకాశాలు పరిశీలిస్తున్నారు. దీర్ఘకాలికంగా పెండింగ్‌ ఉన్నపన్ను బకాయిల వసూళ్లు, పన్నుల ఎగవేతదారులు.. తక్కువ పన్నులు చెల్లిస్తున్న సంస్థలను గుర్తించి వసూలు చేసేందుకు వాణిజ్య పన్నుల శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు.

2నెలల్లో ముగింపు : దేశవ్యాప్తంగా ఏకీకృత పన్నువిధానం- జీఎస్టీ 2017 జులై 1 నుంచి అమల్లోకి వచ్చింది. ఐతే జీఎస్టీ అమలు ద్వారా వచ్చే నష్టాన్ని పూడ్చేందుకు ఐదేళ్లపాటు రాష్ట్రాలకుతగ్గే రాబడిని పరిహారం కింద చెల్లించి ఆ లోటును భర్తీచేస్తామని కేంద్ర ప్రభుత్వం స్పష్టంచేసింది. అందులో భాగంగా 2015-16లో వచ్చిన రాబడికి 14శాతం వృద్ధి రేటు ఆధారంగా బెంచ్‌మార్క్‌ పెట్టుకొని అంతకంటే తక్కువ ఆదాయం వస్తే తగ్గిన రాబడిని పరిహారం కింద కేంద్రం చెల్లించింది. ఆ విధంగా 2017-18లో కేంద్రం నుంచి... 169 కోట్ల రాష్ట్రానికి పరిహారం కింద వచ్చింది. 2018-19లో అనుకున్నదాని కంటే ఎక్కువ వృద్ధిరేటు నమోదు కావడం వల్ల కేంద్రం పరిహారం చెల్లించాల్సిన అవసరం లేకుండా పోయింది. 2019-20లో 2,263... 2020-21లో కోవిడ్‌ వల్ల రాబడులు తగ్గడంతో 5,483 కోట్లు.. 2021-22లో 6,575 కోట్లను పరిహారం కింద రాష్ట్రానికి కేంద్రం ఇచ్చంది. ఆ పరిహారం చెల్లింపునకు కేంద్రం నిర్దేశించిన గడువు.... మరో రెండు నెలల్లో ముగియనుంది. ఆ తర్వాత రాష్ట్రాలకు జీఎస్టీ ద్వారా నష్టం వచ్చినా కేంద్రం నుంచి పైసా పరిహారం రాదు.

6వేల కోట్లకు పైగా ఆదాయం.. : కేంద్రం నుంచి పరిహారం చెల్లింపు గడువు మరో రెండునెలల్లో ముగియనుండడంతో....... రాబడులపై అధ్యయనం చేసిన వాణిజ్య పన్నుల శాఖ...ఏడాదికి 6వేల కోట్లకుపైగా ఆదాయం తగ్గుతుందని అంచనా వేసింది. ఆ మొత్తం కేంద్రం నుంచి వచ్చే అవకాశం లేకపోవడంతో ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా సమకూర్చేలా కసరత్తు మొదలుపెట్టింది. సుదీర్ఘంగా వసూలు కాకుండా ఉండిపోయిన మొండి బకాయిలను రాబట్టేందుకు వన్‌టైం సెటిల్‌మెంట్‌......అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. పెండింగ్‌లో ఉన్న పన్ను చెల్లింపునకు ముందుకొచ్చి ఏకమొత్తంలో చెల్లించిస్తే అపరాథరుసుం, వడ్డీలు లేకుండా చేయడం, పన్ను మొత్తంలో కొంతరాయితీ కల్పించడంపైనా కసరత్తు చేస్తోంది. తద్వారా సుమారు 700 నుంచి వెయ్యి కోట్లు రావచ్చని భావిస్తున్నారు. పన్ను ఎగవేతదారులు, తక్కువ పన్ను చెల్లిస్తున్నవారు...ప్రజల నుంచి జీఎస్టీ వసూలు చేసి ప్రభుత్వానికి చెల్లించని వ్యాపారులను గుర్తించి వసూలు చేయాలని నిర్ణయించింది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.