రాష్ట్రంలోని మరో 8 శాఖలు, 2 శాఖాధిపతుల కార్యాలయాల్లో ఈ-ఆఫీస్ ప్రారంభమైంది. వైద్యారోగ్య, ప్రణాళిక, కార్మిక, బీసీ సంక్షేమం, ఎస్సీ అభివృద్ధి, మైనారిటీ సంక్షేమం, గిరిజన సంక్షేమం, హోంశాఖలతో పాటు పీసీబీ, వ్యవసాయ శాఖ కమిషనర్ కార్యాలయాల్లో ఈ విధానాన్ని సీపీ సోమేశ్ కుమార్ ప్రారంభించారు.
ప్రభుత్వ కార్యాలయాల్లో సమర్థ, కచ్చితమైన సేవలు అందించేలా ఈ-ఆఫీసు ప్రారంభించినట్లు సీఎస్ సోమేశ్ కుమార్ తెలిపారు. ఈ-ఆఫీస్ ద్వారా పారదర్శకంగా, బాధ్యతాయుతంగా, వేగంగా ప్రాసెస్ చేయడానికి వీలు కలుగుతుందని వివరించారు. ఎక్కడ నుంచైనా పనిచేయడానికి వీలుకలగడం సహా సమర్థవంతమైన పాలనను అందించవచ్చని పేర్కొన్నారు.
రాష్ట్రంలో ఇప్పటి వరకు సచివాలయంలోని 15 శాఖల్లో ఈ-ఆఫీసు అమలు చేస్తున్నామని సీఎస్ తెలిపారు. మిగిలిన శాఖల్లో ఈ-ఆఫీస్ అమలును వారంలోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
ఇవీచూడండి: తహసీల్దాల్ కార్యాలయంలో ఈ-ఆఫీస్ ప్రారంభించిన కలెక్టర్