ETV Bharat / city

వాటా సొమ్ముకోసం న్యాయ పోరాటానికైనా సిద్ధమే: హరీశ్​రావు - TS FINANCE MINISTER ON GST

జీఎస్టీ పరిహారం విషయంలో కేంద్ర ప్రభుత్వం వ్యహరిస్తున్న తీరు రాష్ట్రాలకు దానిపై విశ్వాసం సన్నగిల్లేలా చేస్తోందని ఆర్థిక శాఖ మంత్రి టి.హరీశ్‌రావు అభిప్రాయపడ్డారు. ఈ మొత్తం పరిణామాలు దీర్ఘకాలంలో సమాఖ్య వ్యవస్థకు తీవ్ర నష్టం కలిగించేలా ఉన్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వం న్యాయపరంగా, నైతికంగా, ఇచ్చిన మాట మీద నిలబడి రాష్ట్రాలకు పూర్తి పరిహారం ఇవ్వాల్సిందేనని డిమాండ్‌ చేశారు. జీఎస్టీ పరిహారం విషయంలో కేంద్రం చేసిన ప్రతిపాదనల పట్ల పలు రాష్ట్రాలు అభ్యంతరం వ్యక్తంచేస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ ధోరణి, తెలంగాణ ప్రభుత్వ వైఖరిని హరీశ్‌రావు వెల్లడించారు.

harishrao
వాటా సొమ్ముకోసం న్యాయ పోరాటానికైనా సిద్ధమే: హరీశ్​రావు
author img

By

Published : Sep 6, 2020, 7:49 AM IST

* జీఎస్టీ పరిహారం విషయంలో కేంద్రం తీరును ఎలా విశ్లేషిస్తున్నారు?

గతంలో యూపీయే ప్రభుత్వ హయాంలో చిదంబరం ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు సీఎస్టీ ఇస్తామని ఇవ్వలేదు. రూ.5,604 కోట్లకు రూ.1957 కోట్లు మాత్రమే ఇచ్చారు. ఇప్పుడు జీఎస్టీ విషయంలోనూ అలాగే జరుగుతోంది. జీఎస్టీ తెచ్చినపుడు రాష్ట్రాలు గట్టిగా అడిగితే పార్లమెంటులో చట్టం చేస్తున్నాం కదా! అన్నారు.

చట్టంపై విశ్వాసంతో, జాతీయ దృక్పథంతో అంగీకరించాం. ఇప్పుడు మాట తప్పి రాష్ట్రాలనే అప్పు తెచ్చుకోమంటున్నారు. ప్రతి రెండు నెలలకోసారి పరిహారం ఇస్తామని చట్టంలో పేర్కొన్నా అలా ఇవ్వడం లేదు. జీఎస్టీ మిగులు నిధిని కన్సాలిడేటెడ్‌ ఫండ్‌లో జమచేశారు. ఐజీఎస్టీ వాటా కూడా రాష్ట్రాలకు ఇవ్వకుండా రూ.88,344 కోట్లు కేంద్రం తన ఖాతాలో జమ చేసుకుంది.

ఇందులో తెలంగాణకు రూ.2,700 కోట్ల వాటా రావాలి. ఇవన్నీ రాష్ట్రాలకు హక్కుగా, చట్టపరంగా రావాల్సినవే. వీటిపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రధానమంత్రికి, ఆర్థిక మంత్రికి లేఖలు రాశారు. కలిసినప్పుడూ ఈ విషయాన్ని ప్రస్తావించారు. అయినా ఇవ్వకుండా తాత్సారం చేస్తున్నారు. సమాఖ్య వ్యవస్థపైనే నమ్మకం లేనట్లుగా కేంద్రం వ్యవహరిస్తోంది.

* రాష్ట్రాల ద్వారా వసూలైతేనే కదా కేంద్రానికి వెళ్లేది? అది కాకుండా కేంద్రానికి ప్రత్యేకమైన వెసులుబాట్లు ఉంటాయా.

వ్యవస్థలో కేంద్రానికి ఉన్న అవకాశాలు రాష్ట్రాలకు లేవు. ప్రపంచ ఆర్థిక సంస్థల నుంచి రుణం తీసుకోవడానికి కేంద్రానికి అవకాశం ఉంది. అయినా చేయడం లేదు. 18 శాతం ఆదాయం వివిధ పన్నుల రూపంలో కేంద్రానికి వెళ్తుంది. రాష్ట్రానికి ఇలాంటి అవకాశాల్లేవు.

ఇన్ని వెసులుబాట్లు ఉన్న కేంద్రం భేషజాలకు పోకుండా అప్పు తెచ్చుకోవడం ద్వారానో లేదా సమకూర్చుకోవడం ద్వారానో రాష్ట్రాలకు పరిహారం ఇవ్వాలి. అటార్నీ జనరల్‌ కూడా రాష్ట్రాలకు వాటా పంపిణీ చేయాల్సిందేనని చెప్పారు. అయినా రాష్ట్రాలమీదనే బరువు నెట్టాలని ప్రయత్నించడం దారుణం. ‘అప్పులు రాష్ట్రాలు తెచ్చుకుంటే సరి. మనం తెచ్చుకుని ఇబ్బందులు పడకూడదు’ అనే వైఖరి సరైంది కాదు.

* దేశ జీడీపీ, వృద్ధిరేటు నానాటికీ తగ్గడానికి కారణాలేమిటో విశ్లేషించగలరా.

ప్రజల కొనుగోలు శక్తి తగ్గడమే దీనికి ప్రధాన కారణం. పరిస్థితి మెరుగుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ అనేక ప్రత్యామ్నాయ మార్గాలు చూపారు. ‘కొవిడ్‌ కారణంగా లక్షలాది మంది ఉపాధి కోల్పోయారు. భవిష్యత్తు ఏమవుతుందో అనే ఆందోళనలో ఉన్న వారు ఖర్చు చేయడం లేదు. పరిశ్రమల విస్తరణ తగ్గింది.

ఇలాంటి సమయంలో ప్రజల చేతుల్లోకి డబ్బు రావాలి. ప్రభుత్వం ఆ దిశగా పెట్టుబడి పెట్టాలి. సంక్షేమ పథకాలపై ఖర్చు చేయాలి. ఇవన్నీ చేస్తే పరిస్థితి మెరుగుపడుతుంది’ అని కేసీఆర్‌ స్పష్టంగా చెప్పారు. కేంద్రం మాత్రం చేయగలిగిందీ చేయడం లేదు. అందుకే జీడీపీ 23 శాతం మైనస్‌లోకి వెళ్లింది.

చరిత్రలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి లేదు. కొవిడ్‌కు ముందు కూడా ఆర్థిక వ్యవస్థ సరిగా లేదు. వృద్ధిరేటు 8.2 శాతం నుంచి క్రమేణా 3.2 శాతానికి పడిపోయింది. కేంద్రం అంతా అంకెల గారడీ చేస్తోంది. కేంద్ర ప్రభుత్వ విధానాల వల్లే ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా తయారైంది.

* జీఎస్టీతో ఆశించిన ప్రయోజనం కలిగిందంటారా.

జీఎస్టీ వల్ల పన్నుల సరళీకరణ జరిగి ప్రజలకు మేలు కలుగుతుందనుకున్నాం. అదేమీ జరగకపోగా, పరిస్థితి భిన్నంగా తయారైంది. కేంద్రం ప్రజల మీద భారం తగ్గేలా చూడాల్సిందిపోయి, పెంచుకుంటూ పోతోంది. 2020 మార్చి నుంచి మే నెల వరకు పెట్రోలు, డీజిల్‌ మీదనే రూ.13 పెంచింది. దీనివల్ల కేంద్రానికి రూ.రెండు లక్షల కోట్లు అదనంగా సమకూరుతుంది. అయినా రాష్ట్రాలకు న్యాయంగా ఇవ్వాల్సివ సొమ్ము ఇవ్వడానికి అంగీకరించడం లేదు.

హక్కుగా ఇవ్వాల్సిన దాన్ని ఇవ్వకుండా అప్పుగా తెచ్చుకోండి. వడ్డీ మీరే కట్టుకోండి అని కేంద్రం అంటోంది. ఇంతకంటే అన్యాయం ఇంకొకటి ఉంటుందా ? - హరీశ్​

* జీఎస్టీ వల్ల రాష్ట్రానికి నష్టం వాటిల్లిందంటారా.

కచ్చితంగా నష్టం వాటిల్లింది. జీఎస్టీలో చేరకుంటే, అంతకుముందున్న వ్యాట్‌ ద్వారా రూ.25 వేల కోట్ల అదనపు ఆదాయం రాష్ట్రానికి వచ్చేది. దాన్ని కోల్పోయినట్టే కదా. జీఎస్టీ ద్వారా రూ.18,082 కోట్లు రాష్ట్రం నుంచి కేంద్రానికి వెళ్లింది. అందులో రాష్ట్రానికి కేంద్రం తిరిగిచ్చింది రూ.3,223 కోట్లు మాత్రమే.

ఇతర పన్నుల రూపంలోనూ కొంత కోల్పోయాం. పరిహారం రూపంలో రాష్ట్రాలకు మూడు లక్షల కోట్ల రూపాయలు రావాల్సి ఉంటే, రూ.1.65 లక్షల కోట్లు ఇస్తున్నారు. కేంద్రం రాష్ట్రాలకు రెండు ఐచ్ఛికాలు ఇచ్చింది. రెండింటి వల్ల రాష్ట్రాలకు ప్రయోజనం ఉండదు. కేంద్రం తాను తెచ్చిన చట్టాన్ని తానే తుంగలో తొక్కుతోంది.

* కరోనాతో ఆర్థిక సంవత్సరం మొదటి 5 నెలల్లో రాష్ట్ర ఆదాయంపై ఏ మేరకు ప్రభావం పడింది.

రాష్ట్ర సొంత ఆదాయం ఎనిమిదివేల కోట్లు తగ్గింది. ఏప్రిల్‌ నెలలో కేవలం రూ.962 కోట్లు మాత్రమే వచ్చింది. లాక్‌డౌన్‌ ఎత్తేసి వ్యాపార సంస్థలు, ప్రజల కార్యకలాపాలు మొదలైన తర్వాత కొంత మెరుగైంది. జులైలో రూ.5,700 కోట్లు వచ్చింది. మొత్తమ్మీద రాష్ట్ర సొంత ఆదాయంపై తీవ్ర ప్రభావమే పడింది.

అమ్మకం పన్ను బాగా తగ్గింది. స్టాంప్స్‌, రిజిస్ట్రేషన్‌ ఆదాయం 50 శాతం, వాహనాల రిజిస్ట్రేషన్‌ పన్ను ద్వారా రావాల్సిన దాంట్లో 44 శాతం తగ్గింది. కేంద్రం అమలు చేసే పథకాల కింద రావాల్సిన దాంట్లోనూ రూ.732 కోట్లు కోత పెట్టారు. లాక్‌డౌన్‌ వల్ల సొంత ఆదాయం కోల్పోయిన రాష్ట్రాల పట్ల కేంద్రం కనీస మానవతా చూపలేదు. కొవిడ్‌ సంబంధిత ఖర్చులూ రాష్ట్రమే భరించాల్సి వచ్చింది. కేంద్రం మార్గదర్శకాలు మాత్రమే ఇస్తోంది.

* రాబడులు తగ్గిన నేపథ్యంలో అవసరమైన నిధులను ఎలా సమకూర్చుకోనున్నారు. బడ్జెట్‌లో ఏమైనా మార్పులు ఉంటాయా.

ఇబ్బంది ఉన్న మాట వాస్తవం. అయినా రైతు శ్రేయస్సు, సంక్షేమ కార్యక్రమాలను ఎలాంటి ఆటంకం లేకుండా కొనసాగించాలన్నది ముఖ్యమంత్రి పట్టుదల. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి అనేక సందర్భాల్లో స్పష్టం చేశారు.

ఆదాయం తగ్గడం, సంక్షేమ కార్యక్రమాల అవసరాలు వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకొని నిధుల సమీకరణకు సీఎం మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేశారు. ఉప సంఘం దీనిపై కసరత్తు చేస్తోంది. ఎంత మేరకు ఆదాయం పెంచుకోవాల్సి ఉంటుంది, కేంద్రం జీఎస్టీ విషయంలో ఏం నిర్ణయం తీసుకుంటుంది, ఇలా అనేక అంశాల ఆధారంగా బడ్జెట్‌లో మార్పులుంటాయని భావిస్తున్నాం.

* జీఎస్టీ పరిహారం విషయంలో భవిష్యత్‌ కార్యాచరణ ఎలా ఉండబోతోంది.

రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన దాన్ని సాధించుకోవడం కోసం గట్టిగా పోరాడతాం. పార్లమెంటులో లేవనెత్తుతాం. న్యాయపరంగానూ ముందుకెళ్తాం.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.