కరోనా వైరస్ బారిన పడుతున్న పోలీసుల సంఖ్య క్రమంగా పెరుగడంతో పోలీస్ శాఖ అప్రమత్తమైంది. అనారోగ్యంగా ఉండే పోలీసులు, అధికారులు విశ్రాంతి తీసుకోవాలని డీజీపీ మహేందర్ రెడ్డి సూచించారు. లాక్ డౌన్ విధుల్లో భాగంగా పోలీసులు క్షేత్రస్థాయిలో పలురకాల విధులు నిర్వహిస్తున్నారని... దీనివల్ల కొంతమంది కరోనా వైరస్ బారిన పడ్డారని మహేందర్ రెడ్డి తెలిపారు.
కరోనాకు గురైన వాళ్లు.... అనుమానం ఉన్న వాళ్లు వెంటనే సెలవు తీసుకొని విశ్రాంతి తీసుకుంటే వైరస్ ఇతరులకు సోకే అవకాశం ఉండదని డీజీపీ అన్నారు. సెలవు ఇచ్చే విషయంలో యూనిట్ అధికారులు ఎలాంటి సంశయానికి లోనుకావొద్దని... సాధారణ సెలువులు, ఆర్జిత సెలవుల అనుమతి గురించి జాప్యం చేయకుండా వెంటనే విశ్రాంతి తీసుకోవాలని డీజీపీ మహేందర్ రెడ్డి సూచించారు.