ETV Bharat / city

Bandi Sanjay : 'శాసనసభ సాక్షిగా కేసీఆర్​ పచ్చి అబద్ధాలు మాట్లాడారు... ఇవిగో ఫ్రూప్స్​'

శాసనసభ సాక్షిగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ (CM KCR) పచ్చి అబద్ధాలు చెబుతున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ (Bandi Sanjay ) మండిపడ్డారు. ప్రధాని మోదీ, కేంద్రమంత్రులను అవమానించేలా మాట్లాడుతున్నారని మంగళవారం ఒక ప్రకటనలో ధ్వజమెత్తారు. పద్మశ్రీ పురస్కారాల విషయంలో కేంద్రం అన్యాయం చేస్తోందని.. కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యల్ని తప్పుపట్టారు.

Bandi Sanjay
Bandi Sanjay
author img

By

Published : Oct 6, 2021, 8:51 AM IST

ముఖ్యమంత్రి కీసీఆర్ (CM KCR) అసెంబ్లీ సాక్షిగా గత రెండ్రోజులుగా పచ్చి అబద్ధాలు వల్లిస్తూ రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ (Bandi Sanjay ) మండిపడ్డారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర మంత్రులను కూడా అవమానించేలా మాట్లాడుతూ సభా సాంప్రదాయాలను మంటగలుపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పర్యాటక రంగం అభివృద్ధి, విమానాశ్రయాల అనుమతి సహా రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీపై అసెంబ్లీలో కేసీఆర్ చెప్పినవన్నీ పచ్చి అబద్ధాలేనని స్పష్టం చేస్తూ బండి సంజయ్ మంగళవారం రాత్రి గణాంకాలతోసహా వాస్తవాలను వెల్లడించారు.

వారిద్దరికి ఇచ్చింది గుర్తులేదా?

రాష్ట్రానికి పద్మశ్రీ అవార్డుల విషయంలో కేంద్రం అన్యాయం చేస్తోందని, ప్రధానమంత్రి, హోంమంత్రితో మాట్లాడినా ఫలితం లేదంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను బండి సంజయ్ (Bandi Sanjay ) తప్పుపట్టారు. పైరవీలకు తావు లేకుండా పురస్కారాలకు అర్హుల్ని గుర్తించేందుకు కమిటీ వేశారని గుర్తుచేశారు. అందువల్లే రాష్ట్రం నుంచి వనజీవి రామయ్య, ఆసు యంత్రం సృష్టికర్త చింతకింది మల్లేశం వంటి వారికి పురస్కారాలు లభించాయన్నారు.

యునెస్కో గుర్తింపు ఎలా వచ్చింది?

విదేశాంగమంత్రి జైశంకర్‌, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి 19 సభ్యదేశాలను ఒప్పించి రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపు తీసుకురావడం కేంద్రం ఘనత కాదా? అని ప్రశ్నించారు. జోగులాంబ ఆలయానికి కేంద్రం రూ.60 కోట్లు కేటాయించినా రాష్ట్ర ప్రభుత్వ సాంకేతిక తప్పిదంతో ఆలస్యమైన మాట వాస్తవం కాదా? అని అడిగారు. ఆలయ అభివృద్ధికి కేంద్రం రూ.8 కోట్లు విడుదల చేయడం నిజం కాదా? అన్నారు.

అలా అవమానిస్తారా?

కేంద్రమంత్రిని ఇంటికి పిలిచి తిండి పెట్టి అడిగినా విమానాశ్రయాలకు గుర్తింపు ఇవ్వడం లేదంటూ అవమానిస్తారా? అని బండి సంజయ్ ధ్వజమెత్తారు. 6 విమానాశ్రయాల ఏర్పాటుకు కేంద్రం క్లియరెన్స్‌లిచ్చినా రాష్ట్రం నిర్లక్ష్యం వల్లే అనుమతుల్లో జాప్యమవుతోందన్నారు. ఉద్యోగాల కల్పనపైనా సీఎం మాట్లాడినవన్నీ పచ్చి అబద్ధాలేనని ఆరోపించారు. ఇప్పటికే 1.51 లక్షల ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చామని.. 1.31 లక్షల మంది కొలువుల్లో చేరారని.. జోనల్‌ విధానం వచ్చాక మరో 70-80 వేల ఉద్యోగాలొస్తాయని చెప్పడాన్ని తప్పుపట్టారు.

శ్వేతపత్రం విడుదల చేయాలి..

బిశ్వాల్‌ కమిటీ నివేదిక ప్రకారం 31 శాఖల్లో 4,91,304 మందికి గానూ 3,00,178 ఉద్యోగులు మాత్రమే ఉన్నారని తెలిపారు. వారిలోనూ దాదాపు లక్ష మంది కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులేనన్నది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. ఇంకా 1,91,126 ఖాళీలను గుర్తించిన సంగతి మరిచారా? అని అడిగారు. కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే ఉద్యోగ ఖాళీలపై శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు.

ఇదీ చదవండి : 'వచ్చే ఎన్నికల్లోనూ మేమే గెలుస్తాం.. దళితబంధు కోసం లక్షా 80 వేల కోట్లు ఖర్చుచేస్తాం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.