ETV Bharat / city

జీహెచ్​ఎంసీ పోరు: జాతీయ నేతలతో భాజపా పర్యవేక్షణ కమిటీ

author img

By

Published : Nov 15, 2020, 5:36 PM IST

Updated : Nov 15, 2020, 6:36 PM IST

TELANGANA BJP APPOINTS COMMITTEE FOR GHMC ELECTIONS
జీహెచ్​ఎంసీ పోరు: జాతీయ నేతలతో భాజపా కమిటీ

17:27 November 15

జీహెచ్​ఎంసీ పోరు: జాతీయ నేతలతో భాజపా పర్యవేక్షణ కమిటీ

హైదరాబాద్‌ మహానగర పాలక సంస్థ ఎన్నికలపై భాజపా ప్రత్యేక దృష్టిసారించింది. జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు జాతీయ నాయకులతో కమిటీ వేసింది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ నేతృత్వంలో హైదరాబాద్‌ నాంపల్లిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ముఖ్యనేతలు సమావేశమయ్యారు. బల్దియా పోరులో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. 

జీహెచ్​ఎంసీ ఎన్నికల పర్యవేక్షకుడిగా ఎంపీ భూపేందర్‌యాదవ్ సహా మరో నలుగురు సభ్యుల్ని నియమించారు. జీహెచ్‌ఎంసీ భాజపా ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్‌గా కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి వ్యవహరించనున్నారు. కన్వీనర్‌గా లక్ష్మణ్‌, కో-కన్వీనర్లుగా జి.వివేక్‌, గరికపాటి మోహన్‌రావు నియమించారు.  

ఇవీచూడండి: 'గ్రేటర్‌లోనూ దుబ్బాక ఉపఎన్నిక ఫలితాలే'

Last Updated : Nov 15, 2020, 6:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.