తెలంగాణ భవన్లో పనిచేసే ఉద్యోగికి కరోనా పాజిటివ్‌గా అధికారులు నిర్ధారించారు. ఉద్యోగి కుటుంబలోని మరో ఇద్దరికి కూడా వైరస్ సోకినట్లు వెల్లడించారు. అప్రమత్తమైన అధికారులు స్టాఫ్ క్వార్టర్స్, తెలంగాణ, ఏపీ భవన్ పరిసర ప్రాంతాలను... ఉమ్మడి రాష్ట్రాల రెసిడెంట్ కమిషనర్లు తనిఖీ చేశారు. వైరస్ వ్యాప్తిని నియంత్రించడానికి తీసుకోవాల్సిన చర్యలపై సమీక్ష నిర్వహించారు. పరిసరాలను శానిటైజ్ చేయించి... ఇతరుల రాకపోకలపై తాత్కాలిక నిషేదం చేశారు.
ఇవీ చూడండి: 'హరితహారాన్ని పండగలా చేద్దాం... రోడ్లన్నీ పచ్చదనంతో నింపేద్దాం'