ETV Bharat / city

ద్రవ్య వినిమయ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం... నిరవధిక వాయిదా

author img

By

Published : Mar 26, 2021, 2:57 PM IST

Updated : Mar 26, 2021, 3:44 PM IST

telangana budget session
తెలంగాణ అసెంబ్లీ నిరవధిక వాయిదా

14:55 March 26

ద్రవ్య వినిమయ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం... నిరవధిక వాయిదా

ద్రవ్య వినిమయ బిల్లుకు ఆమోదం అనంతరం శాసనసభ నిరవధిక వాయిదా పడింది. మొత్తం తొమ్మిది రోజులపాటు పనిచేసిన సభ.. 47 గంటల 44 నిమిషాలపాటు సమావేశమైంది. 

ముఖ్యమంత్రి, మంత్రులు.. రెండు ప్రకటనలు చేశారు. మొత్తం 75 మంది సభ్యులు ప్రసంగించారు. ఈ బడ్జెట్​ సమావేశంలో మొత్తం 4 బిల్లులు ఆమోదం పొందాయి.

ఈ సమావేశాల్లో 2 లక్షల 30వేల 825.96 కోట్ల రూపాయలతో రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి హరీశ్‌రావు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు.  పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖకు పెద్దపీట వేశారు. వ్యవసాయానికి రూ.25 వేల కోట్లను ప్రతిపాదించారు. ఈ పద్దుపై అధికార తెరాస ప్రశంసల జల్లు కురిపించగా.. ఎప్పటిలాగానే విపక్షం అంకెల గారడీగా పేర్కొంది.  

ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి రాష్ట్ర అప్పు రూ. రెండు లక్షలా 86వేల కోట్లకు చేరనుందని ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి రూ. రెండు లక్షలా 45వేల కోట్ల రుణం ఉండనుండగా రానున్న ఏడాది మరో రూ. 47వేల కోట్ల అప్పును ప్రభుత్వం ప్రతిపాదించింది.  

ఈ సమావేశాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్​.. ఉద్యోగుల చిరకాల వాంఛ అయిన పీఆర్సీని శాసనసభ వేదికగా ప్రకటించారు. 30 శాతం ఫిట్​మెంట్​ ప్రకటించారు. సమావేశాల ఆఖరి రోజైన శుక్రవారం ముఖ్యమంత్రి కేసీఆర్​ లాక్​డౌన్​పై స్పష్టత నిచ్చారు. కరోనా కేసులు మరోసారి విజృంభిస్తున్నా.. ఎట్టిపరిస్థితుల్లోనూ లాక్​డౌన్​ విధించబోమని స్పష్టం చేశారు. లాక్‌డౌన్ వల్ల గతేడాది చాలా నష్టపోయామని అన్నారు. కరోనా ఉద్ధృతి దృష్ట్యానే విద్యాసంస్థలను మూసివేయించామని స్పష్టం చేశారు. కరోనా విస్పోటక రూపం తీసుకోకముందే చర్యలు తీసుకున్నామని వెల్లడించారు.

ఇవీచూడండి:   ఎట్టిపరిస్థితుల్లోనూ లాక్‌డౌన్‌ విధించం: సీఎం కేసీఆర్

Last Updated : Mar 26, 2021, 3:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.