రాష్ట్రంలో కొత్తగా 635 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం బాధితుల సంఖ్య 2,77,151కి పెరిగింది. మరో నలుగురు మరణించారు. ఇప్పటివరకూ కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 1,489కి చేరింది. తాజాగా 565 మంది కోలుకున్నారు. మొత్తంగా 2,67,992 మంది ఈ వ్యాధి నుంచి బయటపడ్డారు. జీహెచ్ఎంసీ పరిధిలో 144 కేసులు నమోదయ్యాయి.
రాష్ట్రంలో ప్రస్తుతం 7,670 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. ప్రస్తుతం హోం ఐసోలేషన్లో 5,557 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు.
ఇదీ చదవండి : ఐశ్వర్యారెడ్డి ఆత్మహత్య నేపథ్యంలో యూజీసీ కీలక నిర్ణయం