ETV Bharat / city

ఏపీ సచివాలయంలో కేసీఆర్​ చిత్రపటానికి పాలాభిషేకం

ఏపీ సచివాలయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి ఉద్యోగులు పాలాభిషేకం చేశారు. ఏపీలో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులను వెనక్కు తీసుకునేందుకు అంగీకరిస్తూ కేసీఆర్​... తీసుకున్న నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు.

ఏపీ సచివాలయంలో సీఎం కేసీఆర్​ చిత్రపటానికి పాలభిషేకం
paalabhishekham to kcr photo in ap secretariat
author img

By

Published : Mar 10, 2021, 1:51 PM IST

ఏపీ సచివాలయంలో సీఎం కేసీఆర్​ చిత్రపటానికి పాలభిషేకం

తెలంగాణకు చెందిన వారై ఉండి... ఏపీ సచివాలయ పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగులు.. కేసీఆర్​ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. సచివాలయం సహా వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగుల్ని వెనక్కు తీసుకునేందుకు కేసీఆర్ అంగీకరిస్తూ దస్త్రాలపై సంతకం చేయటంపై వారంతా హర్షం వ్యక్తం చేశారు.

ఈ మేరకు వారంతా వేడుక చేసుకున్నారు. సచివాలయంతో పాటు హెచ్ఓడీ కార్యాలయాల్లో తెలంగాణ ప్రాంతానికి చెందిన 700 మంది ఉద్యోగులు రాష్ట్రంలో పనిచేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వ తాజా నిర్ణయం మేరకు.. వారందరినీ ఏపీ ప్రభుత్వం త్వరలోనే రిలీవ్ చేసే అవకాశం ఉంది.

ఇదీ చదవండి: 'వచ్చే నెల నుంచి ఎస్సీ, ఎస్టీ, బీసీ నిరుద్యోగులకు కొత్త పథకం'

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.